తండ్రిని అని చెప్పుకుంటూ కూతురికి పెదవి ముద్దులు!
అతడు తనను తాను తండ్రిని అని చెప్పుకున్నాడు. మొదట బుగ్గలపై ముద్దు పెట్టాడు. తరవాత పెదవులపైనా.. అతడు నెమ్మదిగా వేధించడం మొదలుపెట్టాడు.
By: Tupaki Desk | 4 April 2025 3:35 AMఅతడు తనను తాను తండ్రిని అని చెప్పుకున్నాడు. మొదట బుగ్గలపై ముద్దు పెట్టాడు. తరవాత పెదవులపైనా.. అతడు నెమ్మదిగా వేధించడం మొదలుపెట్టాడు. తాకరాని చోట తాకాడు. అసలు అతడు ఎవరో తెలీదు. బంధువును అని చెప్పుకుని ఇంట్లోకి వచ్చాడు. అదంతా ఎనిమిదేళ్ల వయసులో.. చాలా జరిగింది. ఇన్ని రోజులుగా ఎవరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు చెప్పగలను అనిపించింది! అంటూ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెనైంది నటి అంజలి ఆనంద్. కరణ్ జోహార్ `రాఖీ ఔర్ రాణి` చిత్రంలో ఈ భామ నటించింది.
తాజా ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ.. తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయానని అసలు తండ్రి ప్రేమ అంటే ఏమిటో తెలియదని చెప్పింది. అంతేకాదు.. తనను అసభ్యంగా తాకుతూ తండ్రిని అని చెప్పుకునే అతడి ప్రవర్తన మంచో చెడో కూడా తనకు తెలియని వయసు అది అని వెల్లడించింది. తండ్రిని అని చెప్పుకునే అతడు ఒక డ్యాన్స్ టీచర్ అని కూడా హింట్ ఇచ్చింది.
అంతేకాదు.. తన మొదటి ప్రియుడి కారణంగా అతడిని చివరికి ఏదోలా వదిలించుకున్నానని కూడా అంజలి చెప్పారు. రెండేళ్ల పాటు తొలి ప్రియుడితో డేటింగ్ చేసాక బ్రేకప్ అయింది. కానీ అతడి వల్ల నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. అతడి పరిచయంతో చాలా మార్పు కనిపించింది. కానీ బ్రేకప్ అయ్యింది. కొన్నేళ్ల తర్వాత అతడు కలిసినప్పుడు ధన్యవాదాలు తెలిపానని కూడా అంజలి వెల్లడించారు.