Begin typing your search above and press return to search.

తెల్లని చీరలో అంజలి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో

ఈ ఫోటోల్లో ఆమె తెలుపు చీరలో మెరిసిపోతూ, సంప్రదాయానికి గ్లామర్ టచ్ ఇస్తూ కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 3:00 AM GMT
తెల్లని చీరలో అంజలి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో
X

టాలెంటెడ్ నటిగా అంజలి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటోంది. మొదట్లోనే నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందంతో అలరిస్తుంది. లేటెస్ట్ గా అంజలి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన పోటోలను పంచుకుంటూ, ఆమె సౌందర్యాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ ఫోటోల్లో ఆమె తెలుపు చీరలో మెరిసిపోతూ, సంప్రదాయానికి గ్లామర్ టచ్ ఇస్తూ కనిపిస్తుంది.


తెలుపు చీరకు జతగా ఎరుపు బ్లౌజ్ ధరించిన ఆమెకు చిరునవ్వు మరింత ఆకర్షణను చేకూరుస్తుంది. మెరిసే ఈ లుక్‌తో అంజలి ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేక స్థానాన్ని చూపిస్తుంది. ఆమె జుట్టును అర్థచంద్రాకారంలో అలంకరించుకుని, సన్నని ఆభరణాలతో చీర అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. ఫోటోలలో కనిపించే ఆమె లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ఇక ఆమె అందాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో అని కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


అంజలి కెరీర్ విషయానికి వస్తే, ఆమె తమిళ మరియు తెలుగు చిత్రాలలో తనదైన శైలిలో నటించి మెప్పించింది. ఇటీవల విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది, ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మరో కీలక మలుపు కావచ్చు. అంజలి, తన ప్రాజెక్ట్‌లతో పాటు, తన సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా కూడా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది.


ఈ తాజా ఫోటోషూట్‌తో ఆమె తన గ్లామర్, అందాన్ని మరోసారి హైలెట్ చేసింది. ఇక అంజలి ఇటీవల చేసిన సినిమాలు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా, అభిమానుల హృదయాలను గెలుచుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది. ఇక ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిపై అఫీషియల్ క్లారిటీ రానుంది.