న్యూయార్క్ లో గ్లామరస్ అంజలి.. స్టన్నింగ్ లుక్స్
వైట్ డ్రెస్ లో ఆమె లుక్ మరింత అందంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Oct 2024 7:13 PM GMTటాలీవుడ్ అందాల తార అంజలి ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. న్యూయార్క్ నగరంలో తీసుకున్న ఈ ఫోటోలతో ఆమె తన ఫాలోవర్స్ ని మరింత ఆకట్టుకుంటోంది. అంజలి తన క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని మంత్రముగ్ధులను చేస్తుంది. 'సిటీ దట్ నెవర్ స్లీప్స్' అని వ్యాఖ్యానిస్తూ అంజలి పంచుకున్న ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
వైట్ డ్రెస్ లో ఆమె లుక్ మరింత అందంగా కనిపిస్తోంది. బ్యూటిఫుల్ స్మైల్ తో, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో అంజలి ఫోటోలు తీసుకున్న చోటు హడావుడిగా ఉంది. టైమ్స్ స్క్వేర్, మూడంతస్తుల యానిమేటెడ్ బిల్లిబోర్డులు, విభిన్న ప్రజలతో కలగలిసిన హడావిడి నడుమ ఆమె ప్రశాంతమైన ముఖం ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది.
అంజలి ఈ ఫోటోషూట్ ద్వారా తన అందం మాత్రమే కాకుండా తన జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఎంజాయ్ చేసే విధానాన్ని కూడా ప్రదర్శిస్తోంది. ఆమె డ్రెస్, స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్.. అన్ని కలిపి ఈ ఫోటోలకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. టాలీవుడ్ లో ఆమె చేసే ప్రయోగాలు వెండితెరపై మాత్రమే కాదు, సోషల్ మీడియా లో కూడా ఆమె క్రియేట్ చేసే ఆసక్తి భిన్నంగా ఉంటుంది.
ప్రస్తుతం అంజలి తమిళ సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. ఈ ప్రయోగాత్మక పాత్రలో అంజలి ప్రదర్శనను విమర్శకులు కూడా ప్రశంసించారు. ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు, ప్రాజెక్ట్ లలో కొత్తగా కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.