అంజలి గేమ్ ఛేంజింగ్ రోల్
కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ అంటున్నారు.
By: Tupaki Desk | 28 Dec 2024 11:30 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ నెల ఆఖరున మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు అతను చేస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా కియారా అద్వానీ కనిపించబోతోంది. అలాగే తండ్రి పాత్రకి జోడీగా అంజలి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రని ఇప్పటి వరకు శంకర్ రివీల్ చేయలేదు.
సాంగ్స్ అన్ని కూడా ఆల్ మోస్ట్ కియారా అద్వానీతో కలిసి యంగ్ రామ్ చరణ్ కి ఉన్నవిగానే చూపించారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ చెప్పారు. అందుకే ఆమె పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచినట్లు వినిపిస్తోంది.
సినిమాలో స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ లో అంజలి కనిపిస్తుందని అనుకుంటున్నారు. చాలా కాలం తర్వాత అంజలి తెలుగులో చేస్తోన్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. సినిమాలలో ఆమె పాత్రలో ఏదో ప్రత్యేకత ఉంటేనే తప్ప అంజలి మూవీస్ సాధారణంగా ఒప్పుకోదు. శంకర్ కూడా తన సినిమాలలో హీరోయిన్స్ పాత్రలని చాలా బలంగా చూపిస్తాడు
ఏదో గ్లామర్ పరంగా వచ్చిపోయే తరహాలో హీరోయిన్స్ ని శంకర్ ఎప్పుడు చూపించరు. అలాగే 'గేమ్ చేంజర్' లో కూడా అంజలి పాత్రని చాలా బలంగా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మూవీ కథలో అసలైన గేమ్ చేంజర్ గా ఆమె ఉండబోతోందని అనుకుంటున్నారు. అలాగే అంజలికి యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే గేమ్ ఛేంజర్ లో ఆమె పాత్రపై కూడా ఫ్యాన్స్ అంచనాలతో ఉంటారు. సినిమా ఏమాత్రం క్లిక్కయినా కూడా ఆమె కెరీర్ కు మరింత బూస్ట్ లభించినట్లే. ఇక గేమ్ ఛేంజర్ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దిల్ రాజు కూడా ఈ చిత్రంపై 200 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టారు. ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' మూవీ ప్రతి ఒక్కరికి చాలా కీలకం అని చెప్పాలి.