Begin typing your search above and press return to search.

అంజ‌లికి శంక‌ర్ అందుకే అవ‌కాశం ఇచ్చాడా?

తెలుగు న‌టి అంజ‌లి అలియాస్ సీత‌మ్మ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2024 1:30 PM GMT
అంజ‌లికి శంక‌ర్ అందుకే అవ‌కాశం ఇచ్చాడా?
X

తెలుగు న‌టి అంజ‌లి అలియాస్ సీత‌మ్మ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌రి హీరో రామ్ చ‌ర‌ణ్ తో స‌న్నివేశాలు ఉన్నాయా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ శంక‌ర్ సినిమా ఛాన్స్ అందుకుని పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవుతుంది. ఓ తెలుగు న‌టి శంక‌ర్ సినిమాలో ఛాన్స్ అందుకోవ‌డం అన్న‌ది గొప్ప విష‌య‌మే.

ఎంతో మంది న‌టీమ‌ణులున్నా? శంక‌ర్ అంజ‌లిని గుర్తించి అవ‌కాశం ఇవ్వ‌డం అన్న‌ది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మ‌రి శంక‌ర్ ఆమెలో ఏం చూసి అవ‌కాశం ఇచ్చారు? అంటే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ క‌నిపిస్తుంది. అంజ‌లి మార్ష‌ల్ ఆర్స్ట్ ట్రైనింగ్ కూడా తీసుకుంది అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సినిమాల కోసం ఈ విద్య ఉప‌యోగప‌డుతుంద‌ని అంజ‌లి చాలా కాలం క్రిత‌మే మార్షల్ ఆర్స్ట్ నేర్చుకుందిట‌.

మ‌రి శంక‌ర్ ఆమెలో ఈ ట్యాలెంట్ చూసి అవ‌కాశం ఇచ్చారా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. అంజ‌లి ఈ విషయం రివీల్ చేయ‌లేదు గానీ.. ఇలాంటి ట్యాలెంటెడ్ బ్యూటీల్ని శంక‌ర్ ప్రోత్స‌హించ‌డంలో ముందుం టారు. అత‌డి సినిమాల్లో హీరోయిన్ల‌గా ఎంపిక‌య్యారు? అంటే వాళ్ల‌లో ఏదో ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. అయితే గ్రేట్ పెర్పార్మ‌ర్ అయి ఉండాలి. లేదంటే న‌ట‌న‌తో పాటు పాత్ర‌కి ఈజీగా ఉండే అద‌న‌మైన స్కిల్స్ ఉండాలి.

గేమ్ ఛేంజ‌ర్ భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివే శాలున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న చిత్ర‌మిది. చ‌ర‌ణ్ ఇందులో ఐఏఎస్ గా..రాజకీయ నాయ‌కుడి పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.