Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ తో సీత‌మ్మ ప్లాష్ బ్యాక్ రొమాన్స్!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 May 2024 5:19 AM GMT
రామ్ చ‌ర‌ణ్ తో సీత‌మ్మ ప్లాష్ బ్యాక్ రొమాన్స్!
X

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా కియారా అద్వానీ న‌టిస్తోంది. అయితే ఇదే చిత్రం తెలుగు న‌టి అంజ‌లి కూడా న‌టిస్తొంది. కానీ అది సినిమాలో గెస్ట్ రోలా? లేక సెకెండ్ హీరోయిన్ నా? ఈ రెండు గాక‌ ఆరంభం నుంచి స్టోరీతో పాటు కొన‌సాగే పాత్ర అన్నది స‌రైన క్లారిటీ లేదు. కానీ ఇంత‌కాలం మీడియాలో ప్ర‌చారం మాత్రం అది కేవ‌లం ఓ ముఖ్య‌మైన పాత్ర త‌ప్ప చ‌ర‌ణ్ కి పెయిర్ గా కాద‌ని సాగుతోంది.


ఈ విష‌యంలో పెద్ద‌గా హైలైట్ కూడా అవ్వ‌లేదు. దీంతో అంజ‌లి న‌టిస్తుందంటే? న‌టిస్తుంద‌నే త‌ప్ప ఆమె పేరు హైలైట్ అవ్వ‌డం లేదు.ఈ నేప‌థ్యంలో తాజాగా అంజ‌లి త‌న పాత్ర ఎలా ఉంటుందో ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది. ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్ గా కాకుండా కీల‌క పాత్రలు పోషిస్తున్నారు క‌దా? దానికి కార‌ణం ఏంటి? అంటే ఈ సంగ‌తుల‌న్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి. అలాగ‌ని కాదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో నాది కాల‌క పాత్ర కాదు. క‌థానాయిక‌ల్లో ఒక పాత్ర . గేమ్ ఛేంజ‌ర్ లోనూ నా పాత్ర అలాగే ఉంటుంది.

కియారాతో పాటు నేను మరో హీరోయిన్ గా క‌నిపిస్తా. రామ్ చ‌ర‌ణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నేను చ‌ర‌ణ్ కి జోడీగా న‌టించా. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య మంచి పాట కూడా ఉంటుంది` అని తెలిపింది. దీంతో సినిమాలో ప్లాష్ బ్యాక్ స‌న్నివేశాలు కూడా కీల‌కంగానే ఉంటాయ‌ని తెలుస్తోంది. అంటే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చ‌ర‌ణ్ కి జోడీగా అంజ‌లి..ప్లాష్ బ్యాక్ త‌ర్వాత కియారా పెయిర్ గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ని కూడా శంక‌ర్ హైలైట్ చేస్తాడా? అన్న‌ది చూడాలి.

ఇందులో చ‌ర‌ణ్ క‌లెక్ట‌ర్ గా మొద‌లై రాజ‌కీయ నాయ‌కుడిగా ట‌ర్న్ అయ్యే రెండు పాత్ర‌లు పోషిస్తున్నాడు. ప్లాష్ బ్యాక్ స‌న్నివేశాలంటే క‌లెక్ట‌ర్ ల‌వ‌ర్ గానో? భార్య పాత్ర‌గానో అంజ‌లి పాత్ర‌ని డిజైన్ చేసి ఉండొచ్చు. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. అన్ని ప‌నులు పూర్తిచేసి అక్టోబ‌ర్ లేదా డిసెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.