Begin typing your search above and press return to search.

అంజలి ఇంటిమేట్ సీన్స్.. సెట్స్ లో అలా జరిగిందా?

హీరోయిన్ అంజలి.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

By:  Tupaki Desk   |   23 July 2024 8:55 AM GMT
అంజలి ఇంటిమేట్ సీన్స్.. సెట్స్ లో అలా జరిగిందా?
X

హీరోయిన్ అంజలి.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. తనదైన శైలిలో మెప్పిస్తోంది. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో కీలక పాత్ర పోషించింది. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా బహిష్కరణ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంజలి.

ఆ వెబ్ సిరీస్ లో వేశ్య పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించింది. ఇప్పుడు ఆ సీన్స్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు.. మేకర్స్ చాలా జాగ్రత్త పడ్డారని తెలిపింది. సెట్స్ లో ఉన్న అందరికీ బయటకు పంపి షూట్ చేశారని చెప్పింది. ఆ సీన్స్ షూట్ చేసే సమయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యానని పేర్కొంది. ఇప్పటి వరకు ఇలాంటి సీన్స్ ఎప్పుడూ చేయలేదని వెల్లడించింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కోసం కూడా మాట్లాడింది అంజలి. సినిమాలో తాను చేసిన పాత్రకు అనుకున్నదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది. తాను చేసే రోల్ కు ఎంతవరకు న్యాయం చేయాలనేది తన చేతిలోనే ఉంటుందని పేర్కొంది. ప్రతి మూవీకి కూడా స్పెషల్ గా హోం వర్క్ చేస్తానని చెప్పింది. రోల్స్ కోసం కష్టపడతానని తెలిపింది. తాను చేసిన పలు చిత్రాల్లో పాత్రలు డిమాండ్ చేసినందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లు వెల్లడించింది.

గతంలో తాను నటించిన నవరస సిరీస్ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది అంజలి. కాస్ట్యూమ్స్ వల్ల అనేక గంటల పాటు వాష్ రూమ్ కు కూడా వెళ్లలేదని గుర్తు చేసుకుంది. తనకు సంబంధించి వచ్చే తప్పుడు వార్తలను చూసి వెంటనే మర్చిపోతానని తెలిపింది. వాటిని చదివినప్పుడు మాత్రం కాస్త బాధపడతానని చెప్పింది. టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది అంజలి.

ఇక త్వరలో అంజలి.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. సినిమాలో రామ్ చరణ్ కు సతీమణిగా అంజలి కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి పాత్ర కీలకమని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అంజలి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.