Begin typing your search above and press return to search.

మరో ఛాలెంజ్ తో రెడీగా అంజలి..!

ఒక వైపు హీరోలకు జోడీగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడం ద్వారా నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   7 July 2024 10:58 AM GMT
మరో ఛాలెంజ్ తో రెడీగా అంజలి..!
X

తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్‌ సినిమాలతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, కోలీవుడ్‌ కి వెళ్లి అక్కడ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌ సినిమాలు చేసిన అంజలి ఇప్పుడు కోలీవుడ్ మరియు టాలీవుడ్‌ ను బ్యాలన్స్ చేస్తూ వెళ్తుంది.

ఒక వైపు హీరోలకు జోడీగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడం ద్వారా నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా అంజలి ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు 'బహిష్కరణ' అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. 1990 ల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సిరీస్ ఉంటుందని తెలుస్తోంది. అంజలిని ఈ సిరీస్ లో వేశ్య పాత్రలో చూడబోతున్నట్లుగా ఇటీవలే విడుదల అయిన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది.

ఈ మధ్య కాలంలో వరుసగా ఛాలెంజింగ్‌ రోల్స్ తో మెప్పిస్తూ వచ్చిన అంజలి ఒక వేశ్య పాత్రలో నటించడం ద్వారా తనలోని నటిని మరింతగా చూపించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ బహిష్కరణ వెబ్‌ సిరీస్‌ ను జీ5 లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఇటీవల వచ్చిన విశ్వక్‌సేన్ గ్యాంగ్‌ ఆఫ్ గోదావరి సినిమాలో అంజలి వేశ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ కంటే కూడా అంజలికే ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. అలాంటి ఛాలెంజింగ్‌ పాత్రను చేయడం కేవలం అంజలికే చెల్లింది. ఇప్పుడు అదే రేంజ్ ఛాలెంజ్ తో అంజలి రెడీగా ఉంది. జూలై 19న స్ట్రీమింగ్ కు అంతా రెడీగా ఉండండి అంటోంది.