Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్

By:  Tupaki Desk   |   27 May 2024 4:12 AM GMT
గేమ్ చేంజర్.. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఇంకో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందంట. దిల్ రాజు భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. శంకర్ విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కెరియర్ లో గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు భిన్నమైన టైం లైన్స్ లో కనిపించబోతున్నాడు. ఓ క్యారెక్టర్ లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనుండగా మరో క్యారెక్టర్ లో పొలిటికల్ లీడర్ గా నటించాడు. రాజకీయ నాయకుడికి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మూవీలో చాలా కీలకంగా ఉంటుందంట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లో తన పాత్రపై అంజలి క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ చిత్రం గురించి చాలా విషయాలు చెప్పాలని ఉన్న కంట్రోల్ అవుతున్నానని అంజలి పేర్కొంది.

ఏ అప్డేట్ అయిన దర్శక, నిర్మాతల నుంచి వస్తేనే బాగుంటుంది. అందుకే నేను ఏమీ మాట్లాడటం లేదు. అయితే గేమ్ చేంజర్ చిత్రంలో అందరూ అనుకుంటున్నట్లు తాను చిన్న రోల్ చేయడం లేదని, నేను ఒక హీరోయిన్ గా మూవీలో కనిపిస్తానని అంజలి చెప్పింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన పాత్రకి సంబందించిన కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ కూడా మూవీలో ఉందని తెలియజేసింది.

నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మేకర్స్ ప్రకటించనంత వరకు అవి రూమర్స్ మాత్రమే. కియారా అద్వానీతో పాటు నేను కూడా హీరోయిన్ రోల్ లో కనిపించబోతున్న అని అంజలి తెలియజేసింది. గతంలో రామ్ చరణ్ పక్కన ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని బట్టి ఆమె పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ కి జోడీగా నటించిందని తెలుస్తోంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని, ఛాలెంజింగ్ రోల్ కావడంతో చేస్తున్నానని అంజలి ఇంటర్వ్యూలో పేర్కొంది.