Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో అంజలి.. క్యూట్ గానే హీటెక్కిస్తోందిగా

ఇక అంజలి పోస్ట్ చేసిన పిక్స్ లో ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నైట్ పార్టీకి వెళ్లిన అంజలి.. బేబీ పింక్ కలర్ పొట్టి స్కర్ట్ లో మెరిసింది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:52 PM GMT
మినీ స్కర్ట్ లో అంజలి.. క్యూట్ గానే హీటెక్కిస్తోందిగా
X

టాలీవుడ్ హీరోయిన్ అంజలికి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఒక్కో సినిమాకు తనలోనే టాలెంట్ ను బయట పెడుతూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ రాజోలు బ్యూటీ. క్యారెక్టర్ ఏదైనా.. తన నేచురల్ యాక్టింగ్ తో సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది.

హీరోయిన్ పాత్రలే కాదు.. కంటెంట్ ముఖ్యమంటూ సైడ్ రోల్స్ కూడా చేస్తోంది. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో యాక్ట్ చేసి.. తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తోంది అంజలి. ఇక నిన్న(జూన్ 16) బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు అనేక మంది సినీ సెలబ్రిటీల తో పాటు అభిమానులు... సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

అయితే రీసెంట్ గా తన బర్త్ డే పిక్స్ షేర్ చేసింది అంజలి. 'సూర్యుని చుట్టూ మరో ప్రయాణం పూర్తయింది! అంతులేని ప్రేమ, మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లైఫ్ లో కొత్త సంవత్సరాన్ని మరువలేనిదిగా చేద్దాం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం బ్యూటీ వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కేక్ కటింగ్ పిక్స్ ను షేర్ చేసింది. తన బెడ్ పై Happy Birthday అని రాసి ఉన్న పిక్ స్పెషల్ గా ఉంది. తన పెట్ తో దిగిన సెల్ఫీ పంచుకుంది.

ఇక అంజలి పోస్ట్ చేసిన పిక్స్ లో ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నైట్ పార్టీకి వెళ్లిన అంజలి.. బేబీ పింక్ కలర్ పొట్టి స్కర్ట్ లో మెరిసింది. ఆ సమయంలో క్యూట్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని పోజు ఇచ్చింది. స్కిన్ అండ్ థైస్ షోతో ఫిదా చేసింది. సూపర్ బర్త్ డే గర్ల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సింపుల్ గా కనిపిస్తూనే హీట్ పుట్టిస్తోందని చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఇయర్ అని రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం అంజలి.. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తాను కూడా ఒక హీరోయిన్ అని ఇటీవల తెలిపింది. దాంతోపాటు బ‌హిష్క‌ర‌ణ అనే వెబ్‌ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ ను రీసెంట్ గా మేక‌ర్స్ రిలీజ్ చేయగా.. అందులో రౌద్రంగా కనిపించింది. మరి వరుస ప్రాజెక్టులతో అంజలి ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.