ఆ సినిమా కోసం బూతులు మాట్లాడిన అంజలి
సౌత్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న తెలుగు బ్యూటీ అంజలి.
By: Tupaki Desk | 24 May 2024 3:30 PM GMTసౌత్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న తెలుగు బ్యూటీ అంజలి. ఈ అమ్మడు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ లో కూడా వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది. అలాగే సోలో హీరోయిన్ గా గీతాంజలి మూవీతో సక్సెస్ అందుకుంది. అడపాదడపా తెలుగులో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వస్తోంది.
గత నెల గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీతో అంజలి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ మూవీ మే 31న రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూఉండగా అతనికి జోడీగా నేహాశెట్టి కనిపిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో రత్నమాల అనే క్యారెక్టర్ లో అంజలి కనిపించబోతోంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ లో అంజలి పాత్రని డైరెక్టర్ కృష్ణ చైతన్య అయితే రివీల్ చేయలేదు. ఆమె రోల్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో అంజలి తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో రత్నమాల అనే క్యారెక్టర్ లో తాను నటించానని తెలిపింది.
ఈ రోల్ కోసం లైఫ్ లో మొదటి సారి బూతులు మాట్లాడానని అంజలి చెప్పుకొచ్చింది. నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా బూతులు మాట్లాడే క్యారెక్టర్ చేయలేదు. అలాగే బయట కూడా నా వ్యక్తిత్వం అలాంటిది కాదు. కానీ ఈ మూవీలో రత్నమాల క్యారెక్టర్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించినపుడు ఆశ్చర్యం వేసింది. అంజలి ఇప్పటికే ప్రూవ్డ్ యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అయిన ఈజీగా చేయగలదు.
అందుకే రత్నమాల క్యారెక్టర్ కి తనని తీసుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. గోదావరి స్లాంగ్ లో చాలా రఫ్ గా అంజలి పాత్ర గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఉండబోతోందని దీనిని బట్టి తెలుస్తోంది. దీని తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. వింటేజ్ రామ్ చరణ్ కి జోడీగా అంజలి పాత్ర ఈ చిత్రంలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు మూవీస్ వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి అంజలికి మరిన్ని మంచి క్యారెక్టర్స్ వస్తాయని చెప్పొచ్చు.