కొన్ని గంటల పాటు వాష్ రూమ్ కి వెళ్లని అంజలి!
మరో నటి అయితే ఆ ఫీల్ తీసుకురాలేదు? అన్న సందేహం ప్రేక్షకులకు కలిగిందంటే అమె ఎంత చక్కగా నటించిందన్నది చెప్పొచ్చు.
By: Tupaki Desk | 24 July 2024 5:54 AM GMTతెలుగు నటి అంజలి టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడికి అవకాశాలైతే తక్కువగా వస్తున్నాయిగానీ అందుకున్న ఒక్క అవకాశంలోనూ సత్తా చాటి చూపిస్తుంది. ఇటీవలే `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది. అందులో అంజలి ఆహార్యం, నటన ప్రతీది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తెలుగు నటి అయినందకు ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేసింది.
మరో నటి అయితే ఆ ఫీల్ తీసుకురాలేదు? అన్న సందేహం ప్రేక్షకులకు కలిగిందంటే అమె ఎంత చక్కగా నటించిందన్నది చెప్పొచ్చు. ఇటీవలే రిలీజ్ అయిన వెబ్ సిరీస్ `బహిష్కరణ` లో కూడా వేశ్య పాత్ర పోషించి మరోసారి కనెక్ట్ అయింది. ఇందులో అమ్మడు కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటించింది. ఈ సందర్బంగా ఆ అనుభవాలు పంచుకుంది.
`ఇంటిమేట్ సన్నివేశాల సమయంలో కాస్త గందరగోళానికి గురయ్యాను. అందరిముందు నటించా లేమోనని భయపడ్డా . కానీ నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. అందర్ని బయటకు పంపించి మంచి వాతావరణంలో వాటిని షూట్ చేసారు. ఇప్పటి వరకూ ఇలాంటి సన్నివేశాల్లో నటించిన అనుభవం లేదు. దీంతో ఆందోళన పడ్డాను. కానీ ఆ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటిగా దర్శకుడికి కావాల్సిన విధంగా చేసినప్పుడే ఆ సన్నివేశాలు పండుతాయి. అందంతా నటనలో భాగంగా చేసిందే. అలాగే `నవరస` అనే వెబ్ సిరీస్ కోసం విపరీతంగా మ్యాకప్ అవ్వాల్సి వచ్చింది. కాస్ట్యూమ్స్ కారణంగా కొన్ని గంటల పాటు వాష్ రూమ్ కి కూడా వెళ్లలేదు. వెళ్తే మ్యాకప్ తో పాటు, వేసుకున్న దుస్తులు నలిగిపోతాయి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. అప్పటి వరకూ ఏనాడు అంతగా అసౌకర్యానికి గురవ్వలేదు` అని తెలిపింది.