Begin typing your search above and press return to search.

అలాంటి పాత్రలన్ని బోర్ కొట్టేశాయి..!

అయితే స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైన అంజలి తనకు తగిన పాత్రలు చేస్తూ వచ్చింది.

By:  Tupaki Desk   |   29 May 2024 1:43 PM GMT
అలాంటి పాత్రలన్ని బోర్ కొట్టేశాయి..!
X

తెలుగు అమ్మాయి అంజలి మొదటి సినిమా ఫోటో చేసి ఇక్కడ ఛాన్సులు రావట్లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ హీరోయిన్ గా ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ వెంకటేష్ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసిన అంజలి అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. అయితే స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైన అంజలి తనకు తగిన పాత్రలు చేస్తూ వచ్చింది.

దాదాపు అంజలి పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఆమె మళ్లీ నూతన ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. ఈమధ్యనే కోనా వెంకట్ తో కలిసి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంజలి లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో సర్ ప్రైజ్ చేయనుంది. ఈ సినిమాలో అమ్మడు రత్నమాల పాత్రలో నటిస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే ష్యూర్ షాట్ హిట్ అనిపిస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ పై తనకు వచ్చే పాత్రల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అంజలి. తను చేసిన పాత్రల ప్రభావం వల్ల ఒకే తరహా పాత్రలు వచ్చాయి. అందుకే అలాంటి పాత్రలు చేసి బోర్ కొట్టేసిందని అంటున్నారు అంజలి. అందుకే అలాంటి పాత్రలకు ఇక మీదట నో అనేస్తున్నా అని అన్నారు. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తన పాత్ర స్పెషల్ గా ఉంటుందని అన్నారు.

ఒకే రకమైన పాత్రల వల్ల అంజలి అంటే ఇలానే చేస్తుంది అనే భావన వచ్చింది. అందుకే డిఫరెంట్ రోల్స్ చేయాలని అనుకుంటున్నానని అన్నారు అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో తనకు మంచి గుర్తింపు వస్తుందని.. సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని అన్నారు అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమానే కాదు గ్లోబల్ స్టార్ రాం చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కూడా అంజలి ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలిసిందే. 50 సినిమాలు పూర్తి చేసుకున్న అంజలి ఇదే ఫాం మునుముందు కూడా కొనసాగించాలని ఆడియన్స్ కోరుతున్నారు. చూస్తుంటే రాబోతున్న రెండు సినిమాలతో అయితే అంజలి మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేలా ఉందని చెప్పొచ్చు.