Begin typing your search above and press return to search.

నేను, బాలయ్య మంచి ఫ్రెండ్స్ : అంజలి

తాజాగా ఈ విషయంపై హీరోయిన్ అంజలి స్పందించింది. నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరోక్షంగా ట్రోల్స్‏ కు చెక్ పెట్టింది.

By:  Tupaki Desk   |   31 May 2024 6:05 AM GMT
నేను, బాలయ్య మంచి ఫ్రెండ్స్ : అంజలి
X

గత రెండు రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బాలయ్యపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు నెటిజన్లు బాలయ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం ఇటీవల జరిగిన విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ కావడమే.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలయ్య విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత మూవీ హీరోయిన్లతో స్టేజ్ పై ముచ్చటిస్తూ ఒక్కసారిగా అంజలిని పక్కకు తోసేశారు. అందుకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై హీరోయిన్ అంజలి స్పందించింది. నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరోక్షంగా ట్రోల్స్‏ కు చెక్ పెట్టింది. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్స్. నాకు, బాలకృష్ణ గారికి ఒకరిపట్ల ఒకరికి మంచి గౌరవం ఉంది. చాలా కాలంగా మేము స్నేహితులం. ఆయనతో మరోసారి వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది" అని అంజలి పోస్ట్ చేసింది.

అదే ఈవెంట్‌ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది అంజలి. అయితే ఫోటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువు కొద్దీ అలా చేశారని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే చెప్పారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని తెలిపారు. ఆ చర్యకు ముందు వెనుక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా వైరల్ చేయడం తగదన్నారు.

మరోవైపు, బాలయ్య మంచి వ్యక్తి అని విశ్వక్ సేన్ తెలిపారు. సీరియస్ విషయాన్ని కూడా సరదాగా తీసుకుంటారని చెప్పారు. మనం కూడా దేనిని సీరియస్ గా తీసుకోవాలో, దేనిని తేలిగ్గా తీసుకోవాలో అర్థం చేసుకోవాలని అన్నారు. మొత్తం వీడియో చూస్తే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. చివర్లో వాళ్లిద్దరూ హైఫై కూడా కొట్టుకున్నారని విశ్వక్ సేన్ తెలిపారు. మరి బాలయ్యపై ట్రోల్స్ ఇంకా ఎప్పుడు ఆగుతాయో చూడాలి.