Begin typing your search above and press return to search.

అంజలి స్టన్నింగ్ లుక్.. డ్రెస్సుకే అంధమిచ్చేసింది!

ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   14 April 2024 3:43 AM GMT
అంజలి స్టన్నింగ్ లుక్.. డ్రెస్సుకే అంధమిచ్చేసింది!
X

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే మంచి నటిగా గుర్తింపు అందుకుంది తెలుగు అమ్మాయి అంజలి. అయితే మొదట్లో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు అయితే రాలేదు. ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేస్తూ ఆ తర్వాత తెలుగులో కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసింది. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.


ఇక అంజలి కొన్ని ప్రత్యేకమైన లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అందులో మంచి సందేశాత్మక చిత్రాలతో పాటు థ్రిల్లర్ హారర్ కాన్సెప్ట్ లు కూడా ఉన్నాయి. ఇక అంజలి సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఏమాత్రం గ్లామరస్ పోస్ట్ లు చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు కూడా ఫాలోవర్స్ ను మరింతగా ఆకట్టుకున్నాయి.


ఇక రీసెంట్ గా ఆమె ఒక అందమైన కోట్ లో దర్శనమిచ్చింది. కలర్ఫుల్ ఫ్లవర్స్ తో ఉన్న డిజైన్ అంజలికి మరింత అందాన్ని ఇచ్చింది. ఒక విధంగా ఆ డ్రెస్ కి అందం వచ్చింది అనేలా మరికొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అంజలి మంచి కాన్సెప్ట్ అన్న కథలు వస్తే గ్లామరస్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమే అని గతంలోనే వివరణ ఇచ్చింది.


కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ తో కూడా కనిపించిన అంజలి ఎలాంటి పాత్రలలీకైనా సరే న్యాయం చేయగలదు అని నిరూపించింది. ఇక ప్రస్తుతం ఆమె లైనప్ లో అయితే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా అయితే గీతాంజలి కథకు సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.


ఇక ఆ సినిమాలో కూడా ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. ఇక లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఉంది. అందులో కూడా ఆమె చేసే పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. మరి ఈ సినిమాలతో అంజలి ఏ స్థాయిలో తన క్రేj పెంచుకుంటుందో చూడాలి.