స్టార్ హీరో మేన కోడలు తెరంగేట్రం
ఇంతలోనే బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్ మేనకోడలు అంజినీ ధావన్ కూడా బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోందని సమాచారం.
By: Tupaki Desk | 30 Sep 2024 4:30 PM GMTనటవారసులు సినీప్రపంచంలో అడుగుపెట్టడం, ఇక్కడ స్టార్లుగా ఎదుగుతుండడం చూస్తున్నదే. శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ.. సైఫ్ కుమార్తె సారా అలీఖాన్, చంకీ పాండే కుమార్తె అనన్య పాండే, తివారీ కుమార్తె పాలక్ తివారీ, షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ కథానాయికలుగా దూసుకొచ్చారు. ఇప్పుడు హృతిక్ రోషన్ కజిన్ కూడా కథానాయికగా అదృష్టం చెక్ చేసుకుంటోంది. రవీనా టాండన్ కుమార్తె త్వరలో తెరంగేట్రం చేస్తోంది.
ఇంతలోనే బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్ మేనకోడలు అంజినీ ధావన్ కూడా బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోందని సమాచారం. పంకజ్ కపూర్‌తో కలిసి `బిన్నీ అండ్ ఫ్యామిలీ`తో అంజినీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా కానీ, కొత్తగా వచ్చిన ఈ బ్యూటీ తన రెండవ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `సికందర్`లో కీలక పాత్రలో అంజిని నటిస్తోంది.
మిడ్-డే కథనం ప్రకారం... సల్మాన్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో అంజిని నటించారు. అంజినీ ధావన్ పాత్రను త్వరలో చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సల్మాన్ సినిమాలో అంజిని పాత్రకు సంబంధం ఏమిటో ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. దానికి కారణం కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని .. అందుకే ఈ పాత్రను రహస్యంగా ఉంచాలని చిత్ర బృందం భావిస్తోందట. జూనియర్ సల్మాన్ గా పేరున్న, తన వారసుడిగా భావించే వరుణ్ ధావన్ కోసం సల్మాన్ భాయ్ చాలా సహాయం చేసారు. ఇప్పుడు ఆ కుటుంబంలో నటీమణికి అంతే పెద్ద సాయం చేస్తున్నారు.
అలాగే దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ మొదటిసారి కలిసి పని చేస్తున్నారు. రష్మిక మందన్న, సత్యరాజ్, కాజల్ అగర్వాల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తుండగా, మురుగదాస్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 2024లో ముంబైలో ప్రారంభమైంది. సికందర్‌లో శర్మన్ జోషి ఒక ముఖ్యమైన పాత్రలో నటించారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్మన్ - సల్మాన్ నడుమ సీన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెబుతున్నారు. శర్మాన్ పై ఇప్పటికే సన్నివేశాలను చిత్రీకరించారు. అతడు కొంత కాలంగా స్థిరంగా సెట్‌లో ఉన్నాడు. సికందర్ ప్రయాణంలో కీలక వ్యక్తిగాను కనిపిస్తాడని తెలుస్తోంది.
ఏఆర్ మురుగదాస్ అతడి బృందం ప్రస్తుతం ముంబైలో రూ.15 కోట్లతో రూపొందించిన భారీ సెట్‌లో డైలాగ్ సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తున్నారు. నగరంలో చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత, సికందర్ సిబ్బంది ప్యాలెస్‌లో నెల రోజుల పాటు సాగే షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వెళతారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ని డిసెంబర్ 2024 నాటికి చిత్రీకరణను పూర్తి చేసి ఈద్ 2025 కానుకగా విడుదల చేస్తారు. సికందర్ కోసం సౌండ్‌ట్రాక్‌ను ప్రీతమ్ రూపొందించారు. ఇందులో డ్యాన్స్ ట్రాక్‌లు, రొమాంటిక్ పాటలు, ఎమోషనల్ బీట్స్ కూడా ఉంటాయి. సికందర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను అట్లీతో జనవరి లేదా ఫిబ్రవరి 2025లో ప్రారంభించబోతున్నారు.