నయన్ ల్యాండ్ మార్క్ నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్!
గ్లింప్స్ మాత్రం క్రేజీగా ఉంది. అమ్మ-నాయన-నాయనమ్మ తో సంప్రదాయ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నయనతార
By: Tupaki Desk | 25 Oct 2023 5:34 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార ల్యాండ్ మార్క్ 75వ చిత్రం ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియేటెడ్ కాన్సెప్ట్ తో బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటాలని ఎన్నో కథలు..ఎంతో మంది దర్శకుల్ని చూసి చివరిగా నీలేష్ కృష్ణ అనే కొత్త కుర్రాడిక కథకు లాక్ అయింది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్... ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. 'అన్నపూరాణి'-'ది గాడెస్ ఆఫ్ టేస్ట్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
గ్లింప్స్ మాత్రం క్రేజీగా ఉంది. అమ్మ-నాయన-నాయనమ్మ తో సంప్రదాయ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నయనతార. పూజాకార్యక్రమాలతో డే మొదలవుతుంది...అదే కార్యక్రమాలతో రోజు ముగుస్తుం ది. అలాంటి కుటుంబంలో పుట్టిన నయనతార నాన్ వెజ్ ప్రియురాలు. తల్లిదండ్రులు పూజ పనుల్లో ఉంటే బిజినెస్ మేనేజ్ మెంట్ బుక్ నాన్ పీస్ లు..లెగ్ పీసుల్ని చూసి లాలా జాలం కార్చేస్తుంది నయనతార. ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటన్నది తర్వాత తెలుస్తుంది.
ఇందులో స్టోరీ థీమ్ ఏంటి? అన్నది ఎక్కడా రివీల్ చేయలేదు. గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్రాహ్మణ యువతి పాత్రలో నయనతార ఆహర్యం బాగుంది. అదుర్స్ లో ఇప్పటికే అమ్మడు ఈ తరహా రోల్ పోషించి ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో అమ్మడి లాంగావోణి లుక్ కూడా అలాగే ఉంది. ఆహార్యంలో పెద్దగా మార్పులేమి కనిపించలేదు. 'జవాన్' లో టైట్ ఫిట్ దుస్తుల్లో హాట్ హాట్ గా చూసిన బ్యూటీని ఒక్కసారిగా లంగావోణీలో చూడటం సర్ ప్రైజింగ్ అనిపిస్తుంది.
'అన్నపూరణి''లో జై.. సత్యరాజ్.. అచ్యుత్ కుమార్.. కెఎస్ రవికుమార్, మరియు సురేష్ చక్రవర్తి వంటి తారాగణం ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సత్యన్ సూర్యన్.. ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంటోని వ్యవహరి స్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ సహకారంతో జీ స్టూడియోస్ నిర్మిస్తుంది.