Begin typing your search above and press return to search.

న‌య‌న‌తార సినిమా ఇక్క‌డ రిలీజ్ లేన‌ట్లేనా?

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వివాదం త‌లెత్త‌డంతో ఓటీటీల్లో నుంచి తొలగించారు

By:  Tupaki Desk   |   7 Aug 2024 3:30 PM GMT
న‌య‌న‌తార సినిమా ఇక్క‌డ రిలీజ్ లేన‌ట్లేనా?
X

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన `అన్న‌పూర్ణి` పై విశ్వ హిందూ ప‌రిష‌త్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో నెట్ ప్లిక్స్, సింప్లీ సౌత్ ఓటీటీల నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వివాదం త‌లెత్త‌డంతో ఓటీటీల్లో నుంచి తొలగించారు. తాజాగా ఈసినిమా ఏడు నెల‌లు త‌ర్వాత మ‌ళ్లీ డిజ‌ట‌ల్ ప్లాట్ ఫాంకి తీసుకొస్తున్నారు.

ఈ శుక్రవారం నుంచి అన్నపూర్ణి మూవీని సింప్లీ సౌత్ ఓటీటీలో రీ-రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఇండియాలో కాకుండా కేవ‌లం విదేశాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. విశ్వ హిందూ ప‌రిషత్ స‌హా కొన్నిసంఘాలు వ్య‌తిరేకించే అవ‌కాశం ఉండ‌టంతో ఇండియాలో రిలీజ్ చేస్తున్న‌ట్లు లేదు. దీనిపై ఓటీటీ నిర్వాహ‌కులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక్క‌డ రిలీజ్ చేసే అవ‌కాశం కూడా లేద‌ని కొంద‌రంటున్నారు.

వివాదాస్ప‌ద‌మైన చిత్రాల‌కు ఓటీటీలు కూడా దూరంగానే ఉంటున్నాయి. చందాదారుల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే ఓటీటీలు దూరంగా ఉంటున్నట్లు స‌మాచారం. ఈ వివాదంపై నయనతార క్షమాపణలు కూడా చెప్పింది .`నా టీమ్ గానీ, నేను కానీ ఎవరి సెంటిమెంట్‌ను కావాలని బాధపెట్టాలని అనుకోలేదు. జరిగిన సంఘటన తాలుకు లోతు ఎంతో ఉందని మాకు అర్థం అవుతోంది.

దేవుడిని బలంగా నమ్మి దేశవ్యాప్తంగా ఆలయాలకు తిరిగే వ్యక్తిగా నేను ఇలాంటి పని కావాలని ఎప్పుడూ చేయను. మ‌నోభావాలు దెబ్బ తీసి ఉంటే క్ష‌మించ‌గ‌ల‌రు. స్ఫూర్తిని ఇవ్వాలన్నదే అన్నపూర్ణి లక్ష్యం. బాధపెట్టాలని కాదు` అని గ‌తంలో తెలిపారు. వివాదం ఏంటంటే?.. `వంట ప‌ని అంటే చుల‌క‌న భావం చాలా మందిలో ఉంటుంది. కానీ చెఫ్ అన్న‌ది కూడా ఐఏఎస్‌, ఐపీఎస్ లాంటిదే. గౌర‌వ ప్ర‌ద‌మైన వృత్తి గా డైరెక్ట‌ర్ నీలేష్ కృష్ణ చూపించాడు. వంట కూడా ఓ ఆర్ట్ అని చాటిచెప్పాడు. బ్రాహ్మ‌ణ అమ్మాయి చెఫ్‌గా ఎలా మారింది? అన్న‌ది క‌థ‌.