నెట్‌ఫ్లిక్స్ నుండి కూడా తీసేసారు...నయన్ కి ఈ తిప్పలేంటో?
అతన్ని మాంసం తినేవాడు అని ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నెట్‌ఫ్లిక్స్ నుండి సినిమాను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసారు.
By: Tupaki Desk | 11 Jan 2024 8:15 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార ల్యాండ్ మార్క్ 75వ చిత్రం 'అన్నపూర్ణి' ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయిందో తెలిసిందే. కానీ వాటిని అందుకోవడంలో మాత్రం విఫలమైంది. ఈసినిమాతో నయన్ హిట్ కొడుతుందని అంతా భావించారు కానీ ఫలితం నిరాశ పరిచింది. ఎన్నడు లేని విధంగా ఈ సినిమా అమ్మడిని ఏకంగా వివాదంలోకి నెట్టింది. గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సవాళ్లను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఇటీవల మాజీ శివసేన నాయకుడు రమేష్ సోలంకి ఈ చిత్రాన్ని హిందూ వ్యతిరేకి సినిమా విమర్శించారు. చిన్నగా మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు మేకర్స్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకూ దారి తీసింది. మేకర్స్ పై ఎఫ్ ఐఆర్ కూడా నమోదైంది. రెండు రోజుల క్రితం, విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ కూడా ఈ సినిమాపై మండిపడ్డారు. రాముడిని కించపరిచేలా సినిమా ఉందని.. .సినిమాలో సంభాషణల్ని ఖండించారు.
అతన్ని మాంసం తినేవాడు అని ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నెట్‌ఫ్లిక్స్ నుండి సినిమాను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసారు. సినిమా వెనుక బ్యానర్ అయిన జీ స్టూడియోస్‌ను హెచ్చరిం చారు. దీంతో ఈ విషయాన్ని ఏ మాత్రం సీరియస్ చేయకూడదని భావించిన జీ స్టూడియో స్ విశ్వ హిందూ పరిషత్ కి క్షమాపణలు తెలియజేసింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ నుండి టైటిల్‌ను కూడా తొలగించారు.
దీంతో ఈ సినిమా మళ్లీ నెట్ ప్లిక్స్ లో టైటిల్ సహా వివాదాస్పదమైన అంశాల్ని తొలగించి కొత్త వెర్షన్ రీ-రిలీజ్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలాంటి వివాదాదస్పదమైన కంటెంట్ ని చాలా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తొలగించిన తర్వాత మళ్లీ రిలీజ్ చేయడం అన్నది జరగలేదు. కొత్త వెర్షన్ అన్నది అనవసర ప్రయత్నంగానే భావించేవి. అయితే తొలుత రిలీజ్ చేసిన వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తే గనుక మళ్లీ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.