Begin typing your search above and press return to search.

అలర్ట్‌ : అన్నపూర్ణ స్టూడియో పేరుతో మోసాలు

పెద్ద వారి పేరు చెప్పి వారి వద్ద అవకాశాలు ఇప్పిస్తాను అంటూ కొందరు ప్రచారం చేయడం మనం చూస్తూ ఉంటాం.

By:  Tupaki Desk   |   27 March 2025 10:29 AM
అలర్ట్‌ : అన్నపూర్ణ స్టూడియో పేరుతో మోసాలు
X

ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. చదువుకోని వారు మాత్రమే కాకుండా చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ప్రభుత్వం ఎంతగా చెప్పినా సైబర్‌ నేరాలు పెరిగి పోతున్నాయి. సినిమా ఇండస్ట్రీలోనూ సైబర్‌ మోసాల తరహాలో మోసాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద వారి పేరు చెప్పి వారి వద్ద అవకాశాలు ఇప్పిస్తాను అంటూ కొందరు ప్రచారం చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకు గాను కొందరు డబ్బులు సైతం వసూళ్లు చేస్తున్నారు. పెద్ద నిర్మాతల పేరుతో ఎన్నో సార్లు మోసాలు జరిగాయి.

ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి మోసాలకు సంబంధించిన వార్తలు వినడం లేదని అనుకుంటున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ వారు షాకింగ్‌ ప్రకటన చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పేరును ఉపయోగించుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తమకు అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిన వారు ఉన్నారు. అక్కడ జరిగే సినిమా షూటింగ్స్‌కి, సీరియల్‌ షూటింగ్స్‌కి తీసుకు వెళ్తాం, అక్కడ నటించే అవకాశాలు ఇప్పిస్తామని నటీ నటులను, సాంకేతిక నిపుణులను సైతం కొందరు మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ వారు నటీ నటులను, సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నారంటూ కొందరు కేటుగాళ్లు చేస్తున్న ప్రచారం పై అన్నపూర్ణ స్టూడియోస్‌ స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిని అలర్ట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎప్పుడు కూడా జాబ్‌ ఆఫర్స్ అంటూ ప్రకటన చేయదు, ఒక వేళ తీసుకున్నా డబ్బులు వసూళ్లు చేయదని అదులో పేర్కొన్నారు. ఎప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ఆడిషన్స్ పేరుతో డబ్బులు తీసుకోలేదని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మవద్దని, అలాంటివి ఏమైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా మాకు మెయిల్‌ ద్వారా తెలియజేయాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రకటనలో పేర్కొంది. ఆడిషన్స్‌ పేరుతో సినిమా ఇండస్ట్రీలో కొందరు చేస్తున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చెబుతూనే ఉంటారు. అయినా కూడా ఏదో ఒక సమయంలో కొందరు మోసపోతూనే ఉంటారు. ఇకపై అయినా అలాంటి కేటుగాళ్ల నుంచి జాగ్రత్త.