Begin typing your search above and press return to search.

మెగాస్టార్ రికార్డులో మరో ఐఫా

ఇలా రెండు గొప్ప అచీవ్ మెంట్స్ ని మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అందుకున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 5:59 AM GMT
మెగాస్టార్ రికార్డులో మరో ఐఫా
X

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ని అందుకున్నారు. సినిమాలలో అత్యధిక డాన్స్ స్టెప్స్ వేసినందుకు గాను మెగాస్టార్ ఈ వరల్డ్ రికార్డ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిపోయారు. దీంతో పాటు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీదుగా అక్కినేని ఫ్యామిలీ ఏర్పాటు చేసిన నేషనల్ అవార్డుకి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. ఇలా రెండు గొప్ప అచీవ్ మెంట్స్ ని మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అందుకున్నారు. ఇప్పుడు మరో అవార్డుని కూడా తీసుకున్నారు.


24వ ఐఫా అవార్డుల వేడుకలలో అత్యుత్తమ అవుట్ స్ట్రాండింగ్ అచీవ్ మెంట్ 2024 అవార్డుని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. అబుదాబీలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డుని ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ వెటరన్ యాక్టర్ షబానా అజ్మీ, హిందీ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అవార్డుని తీసుకున్నారు. అనంతరం మెగాస్టార్ మాట్లాడారు.


తెలుగు సినీ పరిశ్రమ, అభిమానుల ప్రోత్సాహం వలన ఈ రోజు ఇంత గొప్ప అవార్డుని నేను అందుకోగలిగాను. ఈ అవార్డు కేవలం నా కృషికి మాత్రమే కాకుండా, నా అభిమానుల ప్రేమ, ప్రోత్సాహానికి గొప్ప నిదర్శనం అని చిరంజీవి అన్నారు. ఇంత గొప్ప కీర్తికి కారణం అయిన తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అంటూ మెగాస్టార్ చిరంజీవి తన భావోద్వేగాన్ని స్టేజ్ పైన అందరితో పంచుకున్నారు.


ఆడిటోరియంలో సెలబ్రెటీలు అందరూ కారతాళధ్వనులతో మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు. అలాగే స్టేజ్ పైన నందమూరి నటసింహం బాలకృష్ణ మెగాస్టార్ ని ఆప్యాయంగా కౌగిలించుకొని అభినందించారు. విక్టరీ వెంకటేష్ కూడా మెగాస్టార్ కి అభినందనలు తెలియజేశారు. ఈ ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు స్టేజ్ పై అందరికి అభివాదం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య మధ్యలో అనుబంధాన్ని మరోసారి ఐఫా అవార్డుల వేడుక అందరికి చూపించింది.


బాలయ్య, చిరంజీవి హగ్ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని మెగా, నందమూరి అభిమానులు ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఇతర సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ తో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్టహాసంగా అబుదాబీలో జరిగిన ఐఫా వేడుకలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషలకి చెందిన సెలబ్రెటీలు పాల్గొన్నారు.