'ఓజీ'లో మరో స్టార్ హీరో..క్లైమాక్స్ లో దించుతున్నారా?
సినిమాలో ఓ స్టార్ హీరో కూడా భాగమవుతున్నట్లు సమాచారం. ఆ హీరో సినిమా క్లైమాక్స్ లో వస్తాడని వినిపిస్తుంది.
By: Tupaki Desk | 30 Nov 2024 10:57 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'ఓజీ' సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు డేట్లు కేటాయిస్తే ఆయన పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సెట్స్ ని నేటి నుంచి వెళ్తున్నారు. నాలుగు రోజుల్లో వీరమల్లు నుంచి పవన్ రిలీవ్ అవుతారు. అటుపై ఓజీ సెట్స్ కి వెళ్లనున్నారు. మొత్తంగా 'ఓజీ' షూటింగ్ జనవరికల్లా పూర్తవుతుంది? అన్న దానిపై ఓ క్లారిటీ అధికారికంగా వచ్చేసింది.
ఈ గ్యాంగ్ స్టర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఈపాత్ర సినిమాలో ఎంతో పవర్ పుల్ గా ఉంటుందని ఇప్పటికే లీకులందుతున్నాయి. అర్జున్ దాస్, ప్రశాష్ రాజ్, శ్రియా రెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాత్రలు కూడా ఎంతో శక్తివంతంగా ఉండబోతున్నాయి. ఇదే చిత్రంతో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం ఉంది.
తండ్రి కోరిక మేరకు తనయుడు రంగంలోకి దిగుతున్నాడని వినిపిస్తుంది. తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. సినిమాలో ఓ స్టార్ హీరో కూడా భాగమవుతున్నట్లు సమాచారం. ఆ హీరో సినిమా క్లైమాక్స్ లో వస్తాడని వినిపిస్తుంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరోతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారుట. అయితే డేట్స్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు వినిపిస్తుంది.
మేకర్స్ కోరిన విధంగా డేట్లు సర్దుబాటులో అవాంతరం ఏర్పడుతుందిట. అలాగని అవకాశం కాదనలేనిది కావడంతో ఎలాగైనా సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనూ సదరు స్టార్ ఉన్నట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరో ఎవరు? అన్నది తెలియాలి.