దర్శన్ పై మరో నటుడు సంచలన వ్యాఖ్యలు!
ఆ వ్యక్తి తల్లిదండ్రులునో, భార్య నో చూసి న్యాయం చేయాల్సిందే.
By: Tupaki Desk | 11 July 2024 1:08 PM GMTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడిని తప్పు చేసిన వాడిగా కొందరు భావిస్తే ..చేయని వాడిగా మరికొంత మంది భావించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తాజాగా మరో కన్నడ నటుడు ధనుంజయ్ దీనిపై స్పందించాడు. 'తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చట్టాన్ని మించిన వారు ఎవరుంటారు? పరిస్థితుల్ని అర్దం చేసుకోవాలి.
ఒక జీవితం పోయింది. ఆ వ్యక్తి తల్లిదండ్రులునో, భార్య నో చూసి న్యాయం చేయాల్సిందే. ఈ కేసు బాధితులు మనవాళ్లో? మీ వాళ్లో అయితే! నిందితుడు మనలోనే ఒకరైతే ఎలా ఉంటుంది? ఇది నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. దర్శన్ ని మనస్పూర్తిగా అభిమానిస్తా. అలాగని అతడిని ఈ సమయంలో సమర్దించలేను. ఎందుకంటే చట్టం అనేది ఒకటుంది.
తప్పు చేస్తే శిక్ష తప్పదు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయినా ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. అసలు అక్కడ ఏం జరిగింది? అన్నది ఎవరూ చూడలేదు. కానీ నిజం చట్టానికి తెలుసు. అతని సోదరడి చెబుతున్నా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. నేనేమీ మేధావిని కాదు. ఏమోషనల్ గా మాట్లాడటం తప్ప ఎవరూ చేసేదేం? లేదు. తప్పును మాత్రం ఎవరూ సమర్ధించలేరు` అని అన్నాడు.
అయితే ఇదే విషయంపై ఇంతకు ముందే స్పందించమంటే అతడు నిరాకరించి ఇప్పుడు స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దర్శన్ పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్నాడు. అతడితో పాటు పవిత్రా గౌడ్ కూడా అదే జైలులో ఉంది. దర్శన్ కోసం బెయిల్ ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. కానీ బెయిల్ దొరకడం లేదు. ఇప్పటికే పోలీసులు కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.