Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ తిప్పలు.. ఒకటి పోతే ఇంకోటి..

సాధారణంగా దిల్ రాజు ఎలాంటి సినిమా మొదలుపెట్టిన కూడా పక్క ప్లానింగ్ తోనే ఫినిష్ అవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   21 May 2024 7:57 PM GMT
గేమ్ ఛేంజర్ తిప్పలు.. ఒకటి పోతే ఇంకోటి..
X

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దిల్ రాజు ఎంతో ప్రణాళికతో మొదలుపెట్టినప్పటికీ కూడా ఊహించిన విధంగా బ్రేకులు పడుతూ ఉన్నాయి. సాధారణంగా దిల్ రాజు ఎలాంటి సినిమా మొదలుపెట్టిన కూడా పక్క ప్లానింగ్ తోనే ఫినిష్ అవుతూ ఉంటుంది.

బడ్జెట్ విషయంలో కూడా ఆయన పెట్టుకునే పరిమితులు అన్ని ఇన్ని కావు. దర్శకులకు ముందుగానే తన ప్లానింగ్ గురించి వివరణ ఇస్తారు. అయితే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా సరైన పద్ధతిలో అయితే వెళ్లడం లేదు. అందుకు కారణం దర్శకుడు సడన్ గా ఇండియన్ 2 సినిమాను మొదలు పెట్టడమే.

ఆగిపోయిన ఈ సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత శంకర్ పై పడింది. కోర్టు కేసులతో వివిధ రకాల అంశాలు ముడిపడి ఉండడంతో శంకర్ ఆ ప్రాజెక్టును వదలలేని పరిస్థితి. దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దిల్ రాజు కూడా చేసేదిమీ లేక చాలాసార్లు శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తే అప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఉంటుంది అని ఓపెన్ గా చెప్పేసారు.

ఇక మొత్తానికి ఇటీవల ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలి అని మరొక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా షూటింగ్ పనులు పూర్తి చేయాలని కూడా అనుకున్నారు. శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఆఖరి షెడ్యూల్ మే నెలలోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. ఇది ఏమైనా జూన్ చివరిలోపు చాలావరకు షూటింగ్ పనులను పూర్తి చేయాలని అందరి డేట్స్ కూడా అడిగి తీసుకున్నారు.

ఇక రామ్ చరణ్ కూడా రెడీగా ఉన్నాడు అనుకున్న టైంలో ఊహించిన విధంగా మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు రామ్ చరణ్ అందుబాటులో లేడని తెలుస్తోంది. మరొకవైపు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాలు మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే అలాగే. అలాగే తన ఫ్యామిలీ వెకేషన్స్ లో కూడా చరణ్ చాలా బిజీగా ఉన్నాడు.

కాబట్టి ఇప్పుడు అతను లేటెస్ట్ షెడ్యూల్లో పాల్గొనలెనే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. ఇక శంకర్ కూడా చేసేది ఏమీ లేక ప్రస్తుతం ఇండియన్ 2 ప్రాజెక్టు కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనాలని చూస్తున్నాడు. అయితే దిల్ రాజు మాత్రం చరణ్ తో మాట్లాడి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చేయాలని చర్చిస్తున్నట్లు సమాచారం. మరి చరణ్ షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.