Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్ అనేది నా దృష్టిలో!

`యానిమ‌ల్` విజయం త‌ర్వాత త్రిప్తి డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2024 9:58 AM GMT
నేష‌న‌ల్ క్ర‌ష్ అనేది నా దృష్టిలో!
X

`యానిమ‌ల్` విజయం త‌ర్వాత త్రిప్తి డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ఆరేడు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాన్ ఇండియా సినిమాతో సొంతం చేసుకుంది. బాబి గా అమ్మ‌డు ఇండియానే ఊపేసింది. త్రిప్తీ ఇప్పుడే సినిమా చేసినా అది పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిపోతుంది. అందుకు కార‌ణం అమ్మ‌డికంటూ ప్ర‌త్యేక‌మైన బేస్ ఏర్ప‌డ‌టంతోనే అన్న‌ది తెలిసిన వాస్త‌వం.

అభిమానిలిప్పుడు ఆమెని చెప్ప‌లేనంత‌గా అభిమానిస్తున్నారు. ఓ సంద‌ర్భంలో అభిమానుల ప్రేమ‌పై అంతే ఆస‌క్తిక‌రంగానూ మాట్లాడింది. ఇలాంటి అభిమానుల్ని సంపాదించుకోవ‌డం గొప్ప అదృష్టంగా తెలిపింది. దీంతో అదే అభిమానిలిప్పుడు త్రిప్తీని నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ గాఫేమ‌స్ చేస్తున్నారు. నేష‌న‌ల్ క్రష్ అనే ట్యాగ్ ని జోడించి పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా ఈ అంశంపై త్రిప్తీ డిమ్రీ స్పందించింది.

`హిందీ ప‌రిశ్ర‌మ‌లో కెరీర్ మొద‌లై ఏడేళ్లు అవుతుంది. గొప్ప న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే యాక్టింగ్ ని నేను సీరియ‌స్ గా తీసుకోలేదు. మొద‌టి సినిమా పూర్త‌యిన త‌ర్వాత దాని గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు. ఒక సినిమా చేసా..అదృష్టం ఉంటే రెండ‌వ సినిమా వ‌స్తుంది అనుకున్నా. అదే స‌మ‌యంలో `లైలా మ‌జ్ను` కోసం ఆడిష‌న్ ఇచ్చా.

అప్ప‌టి నుంచి న‌ట‌పన‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు ప్రేక్ష‌కులు నా న‌ట‌న‌తో క‌నెక్ట్ అవుతున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్ర‌మే కాదు. అభిమానుల ప్రేమ‌. వాళ్లు న‌న్ను అలా పిలుస్తున్నంద‌కు చాలా సంతోషంగా ఉంది. ఆ ట్యాగ్ నాపై మ‌రింత బాధ్య‌త పెంచింది` అని తెలిపింది. ఇక అమ్మ‌డు న‌టించిన తాజా చిత్రం `బ్యాడ్ న్యూజ్` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ రావ‌డంతో అమ్మ‌డి ఖాతాలో మ‌రోటి న‌మోదైన‌ట్టే క‌నిపిస్తుంది.