Begin typing your search above and press return to search.

సృష్టి, స్థితి, లయలతో విశ్వంభర ఎంట్రీ..!

ఈ సినిమాలో త్రిష డబుల్‌ రోల్‌ అనే ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 March 2024 8:53 AM GMT
సృష్టి, స్థితి, లయలతో విశ్వంభర ఎంట్రీ..!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో త్రిష డబుల్‌ రోల్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇంకా క్లారిటీ రాకుండానే మరో వార్త ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా ఎంట్రీ సన్నివేశంను అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్‌ తో విజువల్‌ వండర్‌ గా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడట. సృష్టి, స్థితి, లయ లకు సంబంధించిన కొన్ని ఫాంటసీ సన్నివేశాలు మరియు చిరంజీవి చాలా పవర్ ఫుల్‌ అని ముందే చూపించే విధంగా సన్నివేశం ఉండబోతుందని లీక్ లు వస్తున్నాయి.

దర్శకుడు తనకు వచ్చిన ఈ మెగా ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీ లో టాప్‌ దర్శకుల జాబితాలో చేరిపోవాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగా ప్లాన్‌ చేస్తున్నాడట. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూడబోతున్నారు అని ఆ మధ్య చెప్పుకొచ్చాడు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ సినిమాకు గాను కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. హిట్లర్ సినిమాలో మాదిరిగా అన్న చెల్లి అనుబంధంకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయట. సినిమా భారీ స్టార్ కాస్ట్‌ తో ఉంటుందని సమాచారం అందుతోంది.