Begin typing your search above and press return to search.

RC 16: పవర్ఫుల్ పాత్రలో మరో పవర్ఫుల్ హీరో

ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 9:53 AM GMT
RC 16: పవర్ఫుల్ పాత్రలో మరో పవర్ఫుల్ హీరో
X

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా ఈపాటికి షూటింగ్ను స్టార్ట్ చేసుకోవాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ సినిమా పనులు ఆలస్యం అవుతూ ఉండడంతో రామ్ చరణ్ 16వ సినిమాకు ఊహించని విధంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఒక ఆఫీస్ కూడా నిర్మించింది. ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. దర్శకుడు మరొకవైపు సినిమాలో కీలకమైన పాత్రల కోసం ప్రముఖ నటీనటులను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంతకుముందు ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించబోతున్నట్లుగా చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఒక ముఖ్యమైన పాత్రలో ప్రముఖ హీరో నటించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ప్రముఖ హీరోనే క్లారిటీ అయితే ఇచ్చేసాడు. కెప్టెన్ మిల్లర్ సినిమా లో నటిస్తున్న శివ రాజ్ కుమార్ గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ తో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే మెగా పవర్ స్టార్ తో కనిపించబోతున్నట్లు చెప్పేశాడు. దీంతో ఈ సినిమాకు మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన శివ రాజ్ కుమార్ ఇతర భాషలలో మాత్రం పెద్దగా నటించ లేదు.

ఇప్పుడిప్పుడే ఆయన ఫ్యాన్ ఇండియా సినిమాలలో కీలకమైన పాత్రలలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడెప్పుడో తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక సాంగులో అలా కనిపించి వెళ్ళిపోయారు. ఇక తర్వాత జైలర్ సినిమాలో కనిపించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి స్క్రిన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి శివరాజ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఇక RC 16వ సినిమా షూటింగ్ అయితే సమ్మర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.