క్రిస్మస్ వార్ లో మరో సూపర్ స్టార్
ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు చేయగల సామర్థ్యం ఉన్న సినిమాలు అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 25 Nov 2023 6:33 AM GMTఈ క్రిస్మస్ కి సినీ ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ మరియు డంకీ సినిమాలు ఒక్క రోజు తేడా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు చేయగల సామర్థ్యం ఉన్న సినిమాలు అనడంలో సందేహం లేదు.
సలార్ మేకర్ ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించగా, డంకీ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ లు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. కనుక సలార్ మరియు డంకీ సినిమాల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రెండు సినిమాలు కనీసం వారం గ్యాప్ తో వచ్చినా బాగుండు అని రెండు సినిమాలకు చెందిన బయ్యర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ కి ఇంత పెద్ద వార్ జరుగబోతున్న నేపథ్యంలో ముందు వారం, తర్వాత వారం కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు చాలా మంది స్టార్స్ భయపడుతున్నారు. కానీ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం ఆ బిగ్ వార్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
వారం అటు ఇటు కాదు.. ఏకంగా క్రిస్మస్ సందర్భంగానే అంటే డిసెంబర్ 21న మోహన్ లాల్ కొత్త సినిమా 'నేరు' ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నేరు సినిమా మోహన్ లాల్ మరియు జీతూ జోసెఫ్ కాంబోలో రూపొందింది. వీరి కాంబోలో వచ్చిన దృశ్యం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. అందుకే వీరి కాంబో మూవీ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇష్టం.
నేరు సినిమా మలయాళ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం ఆ సినిమా ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది క్లారిటీ లేదు. కనుక సలార్ మరియు డంకీ సినిమాలకు కేరళళో నేరు సినిమా గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఆ రెండు సినిమాల మధ్యే పోటీ ఉంటుంది. మొత్తానికి సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంట్రీతో క్రిస్మస్ పోటీ మరింత రసవత్తరంగా మారింది అనడంలో సందేహం లేదు.