ఇళయదళపతి వెంట మరో తెలుగు నిర్మాత.. బిగ్ డీల్?
గత ఏడాది లియో మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా నిర్మాతకి మాత్రం సాలిడ్ లాభాలు అందించింది.
By: Tupaki Desk | 24 Jan 2024 3:15 AM GMTఇళయదళపతి విజయ్ కోలీవుడ్ లో టాప్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ లో విజయ్ టాప్ 10లో ఉంటాడు. గత ఏడాది లియో మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా నిర్మాతకి మాత్రం సాలిడ్ లాభాలు అందించింది. దీనికి విజయ్ ఇమేజ్ ఒక కారణం అని చెప్పాలి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వారిసు సినిమాతో టాలీవుడ్ దర్శకుడితో కూడా విజయ్ మూవీ చేశాడు. మరికొంత మంది టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ విజయ్ తో మూవీస్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ కోసం కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. రెమ్యునరేషన్ 100 కోట్లకు వచ్చినా నిర్మాతలు విజయ్ తో సినిమా చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.
అయితే విజయ్ ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకట్ ప్రభుత్ దర్శకత్వంలో మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయిన డివివి దానయ్య విజయ్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి డేట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అడ్వాన్స్ కింద 50 కోట్ల డీల్ కూడా సెట్టయినట్లు జోరుగా కోలీవుడ్ మీడియాలో టాక్ మొదలైంది.
విజయ్ కూడా డివివి దానయ్యతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని తెలుగు డైరెక్టర్ తో చేయడం లేదని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తోనే మూవీ ఉంటుందంట. గత ఏడాది లారెన్స్ తో జిగార్తాండ డబుల్ ఎక్స్ తో హిట్ కొట్టిన కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ ఉండే అవకాశం ఉందంట. ఈ ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్.
అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయాలనే అల్పచనలో ఇన్నట్లు ఇదివరకే కథనాలు వెలువడ్డాయి. అయితే అది ఎప్పుడు తెరకెక్కుతుంది అనేది క్లారిటీ లేదు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సీక్వెల్ కూడా కూడా విజయ్ చేయాల్సి ఉంది. అలాగే మరి ఇద్దరు డైరెక్టర్స్ కి కమిట్మెంట్స్ ఇచ్చినట్లు సమాచారం.