Begin typing your search above and press return to search.

ANR శత జయంతి స్పెషల్‌.. ఫ్యాన్స్ కోసం టాప్‌ -10

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం.

By:  Tupaki Desk   |   4 Sep 2024 9:00 AM GMT
ANR శత జయంతి స్పెషల్‌.. ఫ్యాన్స్ కోసం టాప్‌ -10
X

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి గొప్ప క్లాసిక్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏయన్నార్‌ శత జయంతి ఉత్సవాలకు ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారు. ఆ మూడు రోజులు కూడా అక్కినేని ఫ్యాన్స్ కోసం సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ మూవీస్‌ రీ రిలీజ్ చేయబోతున్నారు.


సెప్టెంబర్‌ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. బతికి ఉన్నంత కాలం సినిమానే జీవితంగా బతికిన ఏయన్నార్‌ నటించిన సూపర్‌ హిట్‌ టాప్‌ 10 సినిమాలను సెప్టెంబర్‌ 20 నుంచి 22వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన 25 సిటీల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. సింగిల్ స్క్రీన్‌ థియేటర్ ల్లోనే కాకుండా మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఆ టాప్ 10 సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌ సంస్థలు అయిన ఐనాక్స్, పీవీఆర్‌ లతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ కి శత జయంతి వేడుక సందర్భంగా భారీ ట్రీట్‌ దక్కబోతుంది.

ఏయన్నార్‌ శత జయంతి సందర్భంగా థియేటర్ లో సందడి చేయబోతున్న ఆయన టాప్‌ 10 క్లాసిక్స్ :

దేవదాసు,

మాయాబజార్‌,

మిస్సమ్మ,

డాక్టర్‌ చక్రవర్తి,

భార్యభర్తలు,

గుండమ్మ కథ,

ప్రేమ్‌ నగర్‌,

ప్రేమాభిషేకం,

సుడిగుండాలు,

మనం.

ఏయన్నార్‌ కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు ఉన్నాయి. అందులో వివిధ జోనర్‌ లకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అన్ని జోనర్‌ ల సినిమాల్లో బెస్ట్ సినిమాలను ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఏయన్నార్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. అలాంటి అక్కినేని వారికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి శత జయంతి సందర్భంగా ఘన నివాళ్లు అర్పించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ నుంచి ఎవరు శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారో చూడాలి.