మాస్టర్స్ లో సైకాలజిస్ట్..అందుకే సినిమాలకు దూరంగా!
అన్షు అంబానీ టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు తొలి సినిమా `మన్మధుడు` తో మంచి సక్సెస్ అందు కున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2025 3:47 AM GMTఅన్షు అంబానీ టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు తొలి సినిమా `మన్మధుడు` తో మంచి సక్సెస్ అందు కున్న సంగతి తెలిసిందే. అటుపై ప్రభాస్ తో `రాఘవేంద్ర`.. `మిస్మమ్మ` చిత్రాల్లో గెస్ట్ అపిరియన్న్ ఇచ్చింది. కోలీవుడ్ లో `జై` అనే చిత్రంలోనూ నటించింది. ఇదే అన్షు చిట్ట చివరి సినిమా. ఇదంతా 20 ఏళ్ల క్రితం మాట. మరి అప్పుడు అవకాశాలు రాక సినిమాలు చేయలేదా? వచ్చినా కాదనకుని లండన్ వెళ్లిపోయిందా? అన్న దానిపై తాజాగా అన్షు వివరణ ఇచ్చింది.
`నేను 15 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను. మన్మధుడు, రాఘవేంద్ర సినిమాలు చేసాను. నిజానికి నాకు అప్పటికి అంత పరిణతి లేదు. నటనని కెరీర్ గా భావించలేదు. చదువులపైనే దృష్టి పెట్టాలనుకున్నాను. నటిగా కంటే చదువుకుంటేనే మంచి జీవితం ఉంటుందని అప్పుడనిపించింది. అందుకే లండన్ కు వెళ్లిపోయాను. అక్కడే సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసాను. సొంతంగా ఓక్లినిక్ కూడా ప్రారంభించి థెరఫీలు చేసాను. 24 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు.
ఇది చాలా అందమైన ప్రయాణం. ఒకవేళ 25 ఏళ్ల వయసులో మన్మధుడు సినిమా చేస్తే నటిగా కొనసాగేదాన్ని ఏమో. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత `మజాకా` సినిమా సెట్ లో అడుగు పెట్టిన తర్వాత ఒత్తిడికి గురయ్యాను. ఓకొత్త నటిలాగే అనిపించింది. కెమెరా ముందుకు వచ్చి అన్నేళ్లు అవ్వడంతోనే ఆ రకమైన ఒత్తిడికి గరయ్యాను` అంది. అయితే అందుకు బీజం పడటానికి మరో బలమైన కారణం కూడా ఉందంది. 2023 ఆగస్టులో మన్మధుడు రీ-రిలీజ్ అయింది.
ఆ సమయంలో అన్నపూర్ణ వారు బైట్ ఇ్వమవని అడిగారు. ఇచ్చిన తర్వాత అది నెట్టింట వైరల్ అయింది. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి హైదరాబాద్ రావాలనిపించింది. అలా వచ్చినప్పుడే మజాకాలో అవకాశం వచ్చింది. ఇకపై కంటున్యూగా సినిమాలు చేయాలనుకుటున్నాను. ఎలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్దంగా ఉన్నా`నంది