అనూ 2.0 సడెన్గా ఏంటిలా?
హిట్టును నమ్మే పరిశ్రమలో ఫ్లాప్ హీరోయిన్ కి అవకాశాలు దక్కడం అంత సులువేమీ కాదు.
By: Tupaki Desk | 2 Sep 2024 3:42 AM GMTకెరీర్ లో ఇద్దరు పెద్ద మెగా హీరోలతో నటించింది అను ఇమ్మాన్యుయేల్. కానీ ఆ ఇద్దరూ తనకు హిట్టివ్వలేదు. పవన్ కల్యాణ్ తో `అజ్ఞాతవాసి`, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. ఇవి రెండూ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ ఫలితం అనూ కెరీర్ ని తీవ్రంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. హిట్టును నమ్మే పరిశ్రమలో ఫ్లాప్ హీరోయిన్ కి అవకాశాలు దక్కడం అంత సులువేమీ కాదు. అలాంటి పరిస్థితిలోనే చిన్న హీరోలతో అవకాశాలొచ్చినా ఈ ప్రతిభావని సర్ధుకుంది.
అల్లు శిరీష్ సరసన సహజీవనం నేపథ్యంలో బోల్డ్ సినిమా `ఊర్వశివో రాక్షసివో`లో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా వల్ల తనకు కలిసొచ్చిందేమీ లేదు. తెలుగుతో పాటు తమిళంలోను నటించింది. కానీ అక్కడా లక్ మారలేదు. కార్తీ సరసన జపాన్ లో అను హీరోయిన్ గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ కార్తీ ఆఫర్లు ఇచ్చాడు. కానీ ఏవీ కలిసి రాలేదు. అల్లుడు అదుర్స్, మహా సముద్రం, తుప్పరివాలన్ ఇలా చాలా సినిమాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు.
ఏది ఏమైనా జయాపజయాలతో సంబంధం లేకుండా అనూ ఇమ్మాన్యుయేల్ అభిమానం సంపాదించుకుంది. తెలుగు ఆడియెన్ ఇంకా తనను మర్చిపోలేదు. అందుకే ఇంకా సోషల్ మీడియాల్లో ఇక్కడి వారికి టచ్ లో ఉంది. తాజాగా అనూ పసుపు రంగు చీరలో తళుకుబెళుకులు ప్రదర్శించిన ఫోటోషూట్ నెట్ లో సందడి చేస్తోంది. అనూ 2.0 రీబూటెడ్ అంటూ దీనిపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. అనూ మునుపటి కంటే గ్లామరస్ గా హా* గాను కనిపిస్తోందని కితాబిచ్చేస్తున్నారు.