Begin typing your search above and press return to search.

ఎరుపెక్కించ‌డం ఒకే...కెరీర్ సంగ‌తేంటి అమ్మ‌డు?

హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ వెండి తెర‌పై మెరిసి ఏడాది స‌మీపిస్తుంది కోలీవుడ్ లో `జ‌పాన్` సినిమా త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 5:29 AM GMT
ఎరుపెక్కించ‌డం ఒకే...కెరీర్ సంగ‌తేంటి అమ్మ‌డు?
X

హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ వెండి తెర‌పై మెరిసి ఏడాది స‌మీపిస్తుంది. కోలీవుడ్ లో `జ‌పాన్` సినిమా త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా చేయ‌లేదు. మ‌రి ఇదే అమ్మ‌డి చివ‌రి సినిమా అవుతుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. న‌వంబ‌ర్ లో జ‌పాన్ రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అమ్మ‌డు వెండి తెర‌పై క‌నిపించ‌లేదు. వెబ్ సిరీస్ లు..టీవీ షోలు చేస్తుందా? అంటే వాటిలోనూ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో న‌టిగా అవ‌కాశాలు లేవు అన్న‌ది అర్ద‌మ‌వుతుంది.


మ‌రి ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తుందా? లేదా? అన్న దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని యునైటెడ్ స్టేట్స్ నుంచి దిగింది. ఆరంభంలో అవ‌కాశాలు బాగానే వ‌రించాయి. బ‌న్నీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరోల‌తో త‌క్కువ స‌మయంలోనే న‌టించింది. కానీ కెరీర్ లో ఎలాంటి గ్రోత్ లేదు. వైఫ‌ల్యాలు అమ్మ‌డిని వెన‌క్కి నెట్టాయి. కోలీవుడ్..మాలీవుడ్..శాండిల్ వుడ్ లోనైనా యాక్టివ్ గా ఉందా? అదీ లేదు.


అక్క‌డా అవకాశాలు రావ‌డం లేదు. ఇలా కెరీర్ ప‌రంగా అను అప్ డేట్ లేదు. కానీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా క‌నిపిస్తుంటుంది. కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను క‌వ్విస్తుంటుంది. ఇంకా అను బ్యూటీ టాపిక్ నెట్టింట న‌డుస్తోంది అంటే? ఆ మాత్ర‌మైనా యాక్టివ్ గా ఉండ‌టంతోనే. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు తాజాగా మ‌రో ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా క్యూటీ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది.


మునుప‌టి కంటే మ‌రింత స‌న్న‌జాజిలా మారిపోయింది. ముఖం స‌హా రూప లావ‌ణ్యంలో మార్పులు తీసుకొచ్చింది. అందంగా ముస్తాబై ఇలా ఓ పిక్ ని అంత‌ర్జాలంలోకి వ‌దిలింది. పెదాలపై ఎరుపందం..ముఖంలో మ్యాక‌ప్ అందం. ..హెయిర్ స్టైల్..ముక్కు పుడ‌క ఇలా ప్ర‌తీది అను అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.