Begin typing your search above and press return to search.

అనుదీప్.. ఇంకా ఎన్ని రోజులిలా?

జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 12:30 PM GMT
అనుదీప్.. ఇంకా ఎన్ని రోజులిలా?
X

జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి. ఈ సినిమా అతని ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. జాతిరత్నాలు కంటే ముందు అనుదీప్ పిట్టగోడ అనే సినిమా చేశారు. ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. జాతిరత్నాలు సక్సెస్ తో అతనికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో నెక్స్ట్ సినిమాని ఏకంగా శివ కార్తికేయన్ తో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

ఈ చిత్రాన్ని తన స్టైల్ సింగిల్ లైనర్ కామెడీతోనే తెరకెక్కించాడు. మూవీ కూడా ఆధ్యాంతం నవ్విస్తుంది. శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ కూడా అందరికి కనెక్ట్ అయ్యింది. అయితే మూవీ మాత్రం ఎందుకనో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయడానికి అనుదీప్ వర్క్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ కూడా ఈ మూవీ నిర్మించడానికి రెడీ అయ్యింది.

ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తరువాత రవితేజతో అనుదీప్ సినిమా ఉంటుందనే మాట ప్రచారంలోకి వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కలేదు. అలాగే నవీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ స్టార్ట్ చేసిన ఒక సినిమాకు అనుదీప్ డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం నడిచింది.

దీనిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ అతన్ని హోల్డ్ లో పెట్టిందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ మెగా హీరోకు చిరంజీవికి అనుదీప్ ఓ లైన్ చెప్పాడంట. చిరంజీవికి ఆ స్టోరీలైన్ నచ్చిందంట. అయితే ప్రస్తుతం అహీరో చేస్తున్న సినిమా కంప్లీట్ కావడానికి ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అనుదీప్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అతని కామెడీని మిస్ అవుతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై డైరెక్టర్ అనుదీప్ నుంచి ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అయితే అనుదీప్ తో తప్పకుండా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇక అతను పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో నమ్మకాన్ని కలిగిస్తే వెంటనే ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.