అను ఇమ్మాన్యుయేల్.. లెగ్స్ అందంతో స్టన్నింగ్
ఫోటోల్లో ఆమె స్టైలిష్ లుక్, కూల్ బూట్స్ తో కాంబినేషన్ సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Oct 2024 2:30 AM GMTక్యూట్ యాక్ట్రెస్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అను ఇమ్మాన్యుయేల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టుతో మరోసారి వైరల్ గా మారింది. అమ్మడు అందంతో కూడా ఆకట్టుకుంది. అక్టోబర్ 1వ తేదీని ఆమె "Hello October" అంటూ చేసిన పోస్ట్ అభిమానులను కట్టిపడేస్తోంది.
ఫోటోల్లో ఆమె స్టైలిష్ లుక్, కూల్ బూట్స్ తో కాంబినేషన్ సూపర్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అను తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు ఫ్యాషన్ సెన్స్ కూడా మరోసారి ప్రదర్శించింది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ఆమె అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొంతకాలంగా సినిమాల పరంగా పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తన అందం, స్టైల్‌తో అలరిస్తూనే ఉంది అను.
ఈ ఫోటోలలో ఆమె సింపుల్‌గా ఉన్నా, ఆమె వ్యక్తిత్వం, స్టైల్ మాత్రం మరింత ప్రత్యేకంగా నిలిచాయి. సెటిన్ చైర్ మీద కూర్చొని నిశ్చింతగా ఆలోచనల్లో ఉన్నట్లు కనిపించడం, ఆమెను ఫ్యాషన్ ఐకాన్‌గా నిలబెట్టేలా ఉంది. ఇక ఆమె కెరీర్ విషయానికి తెలుగులో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమెకు మొదటి బ్రేక్ 2016లో వచ్చిన ‘మజ్ను’ మూవీతో వచ్చింది.
ఆ తర్వాత ‘కిట్టు ఉనాడు జాగ్రత్త’, ‘నా పేరు సూర్య’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో భిన్నమైన నటనతో ఆకట్టుకుంది. అయితే, గత కొన్నేళ్లుగా పెద్దగా విజయాలు సాధించకపోయినా, అను తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారు. సినిమాల్లో తగ్గిన అవకాశాలను స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తూ, సోషల్ మీడియా ద్వారా తన స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ పై పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తమిళంలో అమ్మడు ఒక లేడి ఓరియెంటెడ్ వెబ్ సీరీస్ చేస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.