Begin typing your search above and press return to search.

టైగర్ భామ టాలెంట్ చూపిస్తుందిగా..! అను కీర్తి ఫోటో షూట్

తన ఇన్ స్టా ఫోటో షూట్ తో అను కృతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టైగర్ నాగేశ్వర రావు రిజల్ట్ నిరాశ పరచినా ఆ సినిమాతో అను కృతి మీద తెలుగు దర్శక నిర్మాతల కన్ను పడ్డది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 2:30 AM GMT
టైగర్ భామ టాలెంట్ చూపిస్తుందిగా..! అను కీర్తి ఫోటో షూట్
X

మాజీ మిస్ ఇండియా అను కృతి మోడలింగ్ లో తన సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తమిళ సినిమా DSPతో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ సినిమా తర్వాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువే అయినా అను కృతి ఇంప్రెస్ చేసింది. అయితే టైగర్ సినిమాతో ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసిన ఈ అమ్మడు తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో మాత్రం రఫ్ఫాడించేస్తుంది.


ఫాం లో ఉన్న హీరోయిన్ కానీ, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భామలు కానీ ఎవరైనా సరే ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకోవాల్సిందే. అయితే టైగర్ భామ అను కృతి పంథా వేరేలా ఉంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఫోటో షూట్స్ విషయంలో కూడా తన టాలెంట్ చూపిస్తుంది. లేటెస్ట్ గా అందాల భామ అదరగొట్టే అందాలతో గ్లామర్ ట్రీట్ అందించింది.

తన ఇన్ స్టా ఫోటో షూట్ తో అను కృతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టైగర్ నాగేశ్వర రావు రిజల్ట్ నిరాశ పరచినా ఆ సినిమాతో అను కృతి మీద తెలుగు దర్శక నిర్మాతల కన్ను పడ్డది. తప్పకుండా అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అనుకృతి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైన సరే పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనక తప్పదు. ఎల్లో కలర్ స్ల్వీన్ లెస్ జాకెట్ తో గ్లామర్ షో చేస్తున్న అను కృతి చూస్తుంటే ఎలాంటి ఆఫర్ అయినా సరే ఓకే అనేలా హింట్ ఇస్తుంది.

ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న అను కృతి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుతుంది. అప్పటిదాకా తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో అమ్మడు ఆడియన్స్ ని డిస్టర్బ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి అను కృతి నెక్స్ట్ సినిమా ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి. తెలుగు తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలని చూస్తుంది అను కృతి. టైగర్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఈలోగా ఒక్క హిట్ సినిమా పడింది అంటే ఇక అమ్మడిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.