Begin typing your search above and press return to search.

అవార్డ్ రాకపోవడంపై 'వీరమల్లు' యాక్టర్ షాకింగ్ కామెంట్స్!

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖేర్ మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికిగానూ తనకు అవార్డులు రాకపోవడంపై స్పందించారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 3:38 AM GMT
అవార్డ్ రాకపోవడంపై వీరమల్లు యాక్టర్ షాకింగ్ కామెంట్స్!
X

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్‌ ఖేర్‌ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలతో, తన విలక్షణమైన నటనతో నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లీష్, చైనీస్ వంటి భాషల్లో నటించారు. డెబ్భై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖేర్ మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికిగానూ తనకు అవార్డులు రాకపోవడంపై స్పందించారు.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం "ది కాశ్మీర్ ఫైల్స్". ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డ్ సాధించింది. అలానే ఇందులో నటించిన పల్లవి జోషి ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. కానీ అనుపమ్ కు అవార్డ్ రాలేదు. ‘విజయ్‌ 69’ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఖేర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ అవార్డ్ రానందుకు తనకేమీ బాధ లేదని అన్నారు.

నాకు అవార్డులంటే చాలా ఇష్టం.. అందుకే నా సిస్టమ్ నుండి వాటిని బయటకు తీయనివ్వండి అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. "మీరు ఏదైనా కష్టపడి పనిచేస్తే, మీకు అవార్డు వస్తుందనే మాటలను నేను చిన్నతనంలోనే విన్నాను. దానికి తగ్గట్టుగానే పని చేసుకుంటూ వచ్చాను. నేను ఇప్పటి వరకూ ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు అవార్డులు రాకపోవడంలో నాకు బాధ లేదు. కానీ ‘విజయ్‌ 69’ ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ తో కూడిన ఇంటర్నేషనల్ ఫిలిం అనేది నా అభిప్రాయం. ఇది అవార్డుల్లో దేనికైనా పోటీనిస్తుంది."

"లోకల్ అవార్డులు తప్పనిసరిగా నైపుణ్యం లేదా బ్రిలియన్స్ ఆధారంగా ఉండవు. నాకు ఇష్టమైన, నేను బాగా నటించిన చిత్రాల్లో ఒకటైన 'కాశ్మీర్ ఫైల్స్‌' మెయిన్ అవార్డులను గెలుచుకోనప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇంకెవరికి ఇస్తారు?. అయినా నాకు బాధలేదు. 'ది కాశ్మీర్ ఫైల్స్'కి నాకు అవార్డు ఇవ్వని వారు 'విజయ్ 69' సినిమాకి అవార్డు ఇస్తే, నేను సంతోషిస్తాను. ఈ చిత్రం పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లోకి రాబోతోంది కాబట్టి, ప్రజలు దీన్ని ఇష్టపడితే, అదే పెద్ద విజయం అని నేను భావిస్తున్నాను." అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు.

1987లో 'త్రిమూర్తులు' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్.. దాదాపు 35 ఏళ్ల తర్వాత 'కార్తికేయ 2' సినిమా ద్వారా తెలుగు తెర మీద కనిపించారు. ఆ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నిఖిల్ 'ఇండియా హౌస్', పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాల్లో ఖేర్ నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘విజయ్‌ 69’ మూవీ విడుదలకు సిద్ధమైంది. 69 ఏళ్ల వ్యక్తి ట్రైయాథ్లాన్‌లో పాల్గొనడం అనే లైన్ తో ఈ సినిమా రూపొందింది. ఇది డైరెక్ట్ ఓటీటీ విధానంలో నవంబరు 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీని తర్వాత అనుపమ్ 'ఎమర్జెన్సీ' చిత్రంతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు.