Begin typing your search above and press return to search.

`ఫౌజీ`లో సీనియ‌ర్ సంచ‌ల‌నం!

తొలిసారి నిఖిల్ హీరోగా న‌టించిన `కార్తికేయ‌-2`లో విభిన్న‌మైన పాత్ర‌లో అల‌రించారు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 9:08 AM GMT
`ఫౌజీ`లో సీనియ‌ర్ సంచ‌ల‌నం!
X

బాలీవుడ్ లెజెండ్ అమితాబ‌చ్చ‌న్ ఇప్ప‌టికే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` లో గురువు పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. అటుపై `క‌ల్కి 2898` తో అశ్వ‌ధామ పాత్ర‌తో పాన్ ఇండియాలో మ‌రోసారి సంచ‌ల‌నం అయ్యారు. ఈ రెండు పాత్ర‌లు బిగ్ బీ గౌర‌వాన్ని అంత‌కంత‌కు పెచే పెంచిన‌వే. అటుపై మ‌రో సీనియ‌ర్ సంచ‌ల‌నం అనుప‌మ్ ఖేర్ కూడా ఇదే బాట‌లో తెలుగులో గొప్ప పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు.

తొలిసారి నిఖిల్ హీరోగా న‌టించిన `కార్తికేయ‌-2`లో విభిన్న‌మైన పాత్ర‌లో అల‌రించారు. అటుపై మాస్ రాజా ర‌వితేజ హీరోగా న‌టించిన `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`లోనూ అనుప‌మ్ ఖేర్ న‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా పాన్ ఇండియా చిత్రం `పౌజీ` లోనూ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అనుప‌మ్ ఖేర్ ని కీల‌క పాత్ర‌కి తీసుకున్నారట‌. అయితే ఈ విష‌యం క‌న్ప‌మ్ కావాల్సి ఉంది. మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ఇంకా ధృవీక‌రించ‌లేదు.

అనుప‌మ్ ఎంట్రీ అన్న‌ది బాలీవుడ్ మీడియాలో జరుగుతోన్న ప్ర‌చారం మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అనుప‌మ్ ఖేర్ తెలుగు సినిమా ఎంట్రీ విష‌యానికి వ‌స్తే మూడు ద‌శాబ్ధాల క్రిత‌మే ఆయ‌న టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. విక్ట‌రీ వెంక‌టేష్, యాక్ష‌న్ కింగ్ అర్జున్, న‌ట కిరీటీ రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `త్రీమూర్తులు` సినిమాతో 1987లోనే లాంచ్ అయ్యారు.

అందులో అనుప‌మ్ ఖేర్ డాన్ పాత్ర పోషించారు. అప్ప‌టికే అనుప‌మ్ ఖేర్ బాలీవుడ్ లో బిజీ ఆరిస్ట్. న‌టుడిగా చాలా సినిమాలు చేసారు. అలాంటి బిజీలో టాలీవుడ్ లో లాంచ్ అయినా త‌ర్వాత కాలంలో తెలుగు సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేదు. బాలీవుడ్ లోనూ కొన‌సాగారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కార్తికేయ‌-2 తోనే రీ-లాంచ్ అయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ నూతన నటి ఇమావి మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి.