Begin typing your search above and press return to search.

కంప‌ర్ట్ జోన్ అంటే నాకు మ‌హా బోరింగ్!

ప్ర‌స్తుతం అమ్మ‌డి బిజీ షెడ్యూల్ చేస్తే వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ డేట్లు కేటాయించే ప‌రిస్థితి లేదు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 8:30 AM GMT
కంప‌ర్ట్ జోన్ అంటే నాకు మ‌హా బోరింగ్!
X

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. `రౌడీబోయ్స్` విజ‌యం త‌ర్వాత అమ్మ‌డి జ‌ర్నీ ఊహించ‌నంత‌గా సాగుతుంది. వ‌రుస విజ‌యాల‌తో తానో బ్రాండ్ బ్యూటీన‌ని మార్కెట్ లో ప్రూవ్ చేస్తోంది. ఈ ఏడాది `టిల్లు స్క్వేర్` తో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి బిజీ షెడ్యూల్ చేస్తే వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ డేట్లు కేటాయించే ప‌రిస్థితి లేదు.

అన్ని సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో రెడీగా ఆరు సినిమాలున్నాయి. అవ‌న్నీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `భిన్న‌మైన సినిమాల ప్ర‌యాణ‌మంటేనే నాకు ఇష్టం. అది మాత్ర‌మే ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. న‌టిగా ప‌రిపూర్ణ తృప్తిని క‌లిగిస్తుంది. కంప‌ర్ట్ జోన్ లో సినిమాలు చేయ‌డం అస్సలు ఇష్టం ఉండ‌దు.

అలా ప‌ని చేయ‌డం నాకు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే నేనెప్పుడు ప్ర‌యోగాలు చేయాల నుకుంటా. ఏ పాత్ర చేసినా అందులో నాకు న‌టిగా స‌వాల్ విసిరే స‌న్నివేశాలు ఉండాల‌ని కోరుకుంటా. సెట్లో ద‌ర్శ‌కుడు రీటెక్స్ అడిగిన‌ప్పుడు నాలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఎన్ని టేక్ లు అడిగినా విసుగు చెంద‌కుండా ప‌నిచేయ‌డం అంటే ఎంతో ఇష్టం. అలా అడిగిన ద‌ర్శ‌కుల‌పై నాకు ప్ర‌త్యేక‌మైన అభిప్రాయం ఉంటుంది.

బాగా న‌టించావ్ అనే ప్ర‌శంస కంటే? రీటేక్ అనే ప‌ద‌మే నా చెవుల‌కు ఇంపుగా అనిపిస్తుంది. న‌టిగా ఎంత ప‌రిణితి చెందిదో అంత గొప్పగా న‌టించ‌డానికి .. మంచి ఔట్ ఫుట్ ఇవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఏదైనా నిరంత‌రం పని చేస్తూ ఉంటేనే ఆ రక‌మైన అనుభ‌వం సంపాదించ‌గ‌లం. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ప‌రాజ‌యాల నుంచి నేను నేర్చుకున్న‌వి ఇవి` అని అంది.