Begin typing your search above and press return to search.

అనుపమ ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారెందుకు..?

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోవాల్సిన రేంజ్ ఉన్నా కూడా ఆమె ఆ రేంజ్ లో వెళ్లలేకపోయింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 2:30 AM GMT
అనుపమ ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారెందుకు..?
X

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోవాల్సిన రేంజ్ ఉన్నా కూడా ఆమె ఆ రేంజ్ లో వెళ్లలేకపోయింది. చేస్తున్న సినిమాలు కూడా ఆమె స్థాయికి తగినవి కాదని కూడా ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుపమ కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి సినిమాలు చేసింది. అంతేకాదు అప్పట్లో కాస్త బొద్దుగా కనిపించిన అమ్మడు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

ఐతే స్లిమ్ గా అవ్వాలన్నది తన ఆలోచనో లేదా ఎవరైనా సలహా ఇచ్చారో కానీ అమ్మడు ఎప్పుడైతే స్లిమ్ గా మారిందో ఆమెకు ఛాన్స్ లు కూడా కరువయ్యాయి. ఆశించిన పాత్రలు రాక చేసేది ఏమి లేక వచ్చిన సినిమాలనే చేస్తుంది అనుపమ. తెలుగులో రవితేజ లాంటి స్టార్స్ తో ఛాన్స్ అందుకున్నా లక్ కలిసి రాలేదు. ఇక తమిళ్ లో అమ్మడు యువ హీరోల సరసన నటిస్తుంది. లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్రాగన్ సినిమాలో నటించింది అనుపమ.

అందులో అనుపమ ఫస్ట్ హాఫ్ వరకు హీరోయిన్ గా కనిపించినా సెకండ్ హాఫ్ అది సపోర్టింగ్ రోల్ లా అనిపిస్తుంది. అనుపమతో పాటు ఈ సినిమాలో నటించిన కయదు లోహర్ స్క్రీన్ ని ఎట్రాక్ట్ చేసింది. అనుపమ ఈ పాత్రలో కనిపించి తన ఖాతాలో ఒక సినిమా పడేలా చేసుకుంది కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమెను ఇలా చూడాలని అనుకోవట్లేదు. ప్రేమం, అ ఆ సినిమాల్లో అనుపమ రేంజ్ వేరని అంటున్నారు.

మళ్లీ తన లుక్ మార్చే విషయం పక్కన పెడితే అనుపమ ఇక మీదట ఎంచుకునే పాత్రల్లో అయినా బెటర్ మెంట్ ఉండాలని కోరుతున్నారు. ఐతే ఎలాంటి అవకాశాలు లేని టైం లో వచ్చిన ఏ ఛాన్స్ అయినా చేయాలని అనిపిస్తుంది. ఐతే అనుపమ తన ఫ్యాన్స్ అందరు తనని క్లాస్ గా ఉండాలని కోరుతుంటే అమ్మడు మాత్రం అసలు వాటిని పట్టించుకోకుండా వచ్చిన పాత్రలను చేస్తుంది. అనుపమ లో ఈ మార్పు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి. డ్రాగన్ సినిమా సక్సెస్ అయినా అనుపమ ఫ్యాన్స్ మాత్రం అప్సెట్ లో ఉన్నారు. మరి ఇక మీదట అయిన అనుపమ తన ఫ్యాన్స్ గురించి కాస్త పట్టించుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.