తెలుగు సినిమాలో సమంత గెస్ట్ రోల్..!
టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్ జోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి 'డ్రాగన్' సినిమాతో హిట్ దక్కింది.
By: Tupaki Desk | 12 March 2025 6:00 PM ISTటాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్ జోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి 'డ్రాగన్' సినిమాతో హిట్ దక్కింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మంచి పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. దాంతో సినిమా విడుదల తర్వాత కోలీవుడ్‌లో అనుపమ క్రేజ్ అమాంతం పెరిగింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమకి తాజాగా రెండు తమిళ్ సినిమా ఆఫర్లు వచ్చాయని సమాచారం అందుతోంది. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
అనుపమ ప్రస్తుతం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో 'పరధ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఆకర్షిస్తూ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అనుపమ పరమేశ్వరన్ దక్కించుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అనుపమతో పాటు సంగీత క్రిష్, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు అనుపమ ఆన్ స్క్రీన్ యాక్షన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది.
స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు ఓకే చెప్పిందట. అనుపమ పరమేశ్వరన్‌తో సమంతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా కోసం అనుపమ స్వయంగా సమంతను గెస్ట్ రోల్‌లో నటించాల్సిందిగా కోరిందని, అందుకు సామ్ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే పరధా షూటింగ్ కోసం సమంత రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు నుంచి పది నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాత్ర ఎంతది అయినా సమంత ఉంది అంటే కచ్చితంగా పరధా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
తెలుగులో రూపొందుతున్న పరధా సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు. అందుకే సమంత గెస్ట్ అప్పియరెన్స్ కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పరధాలో సమంత నటిస్తుందా అనే విషయమై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అ ఆ' సినిమాలో సమంత హీరోయిన్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమాలో సమంత, అనుపమ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసింది లేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.