ఈగల్ అనుపమ.. కొంచం ఇష్టంగా.. కొంచం కష్టంగా..!
కార్తీక్ తో ఉన్న రిలేషన్ ఏంటని.. ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చారు యాంకర్ సుమ. కార్తీక్ ని స్టేజ్ మీదకు పిలిపించి అతనికి కట్టించారు.
By: Tupaki Desk | 5 Feb 2024 4:16 AM GMTమాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన సినిమా ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాతో దేవ్ జాండ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు. సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుండంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ అనుపమ స్పీచ్ ఆకట్టుకుంది.
స్టేజ్ మీదకు అనుపమ రాగానే ఆమెకు కార్తీక్ ని తను అన్నయ్య అన్న వీడియో చూపించారు. కార్తీక్ తో ఉన్న రిలేషన్ ఏంటని.. ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చారు యాంకర్ సుమ. కార్తీక్ ని స్టేజ్ మీదకు పిలిపించి అతనికి కట్టించారు. కార్తీక్ తో నలుగు సినిమాలు వర్క్ చేశా కాబట్టి అన్నయ్య అని పిలుస్తున్నానని అన్నారు అనుపమ. తను చాలా తక్కువ మందిని అన్నయ్య అంటానని కార్తీక్ అలా కనెక్ట్ అయ్యారని అన్నారు. ఇక ఈగల్ సినిమాలో చేయడం చాలా లక్కీ అని అన్నారు అనుపమ. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ చెప్పారు అనుపమ. ఇది వాళ్లతో సెకండ్ సినిమా అని అన్నారు.
కార్తీక్ అన్నయ్యతో ఇది నాలుగో సినిమా.. అతన్ని కార్తీక్ అని పిలవడానికి ట్రై చేశా కుదరట్లేదు. ఆ వీడియో వైరల్ అయ్యింది. అన్నయ్య ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్ అని అన్నారు అనుపమ. మామూలుగా ఏ సినిమాలో అయినా అందరు యాక్టర్స్ తో కాంబినేషన్ సీన్ ఉండదు. కానీ తన అదృష్టం ఏంటంటే ఈ సినిమాలో అందరితో సీన్స్ ఉన్నాయి. అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ మోటివ్ ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. ఈ సినిమాలో కన్నా భారీ డైలాగ్స్ రాసి నన్ను టార్చర్ చేయాలని డైలాగ్ రైటర్ మణి గురించి అన్నారు అనుపమ.
సినిమాలో నటించిన క్రూ అందరికీ థాంక్స్ చెప్పిన అనుపమ రవితేజ గారితో పనిచేయడం కొంత హ్యాపీగా ఉన్నా కొంత సాడ్ గా కూడా ఉంది. అది ఎందుకన్నది ఆయనకు తెలుసని అన్నారు. సినిమాకు పనిచేసిన వారంతా కూడా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్లందరికీ ఈ సినిమా సక్సెస్ అందించాలని అన్నారు అనుపమ.