Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : విజయంతో అందాల చిరు మందహాసం

తాజాగా ఈ అమ్మడు టిల్లు స్క్వేర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   5 April 2024 10:19 PM IST
పిక్ టాక్ : విజయంతో అందాల చిరు మందహాసం
X

ప్రేమమ్‌ సినిమాతో సౌత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్‌ తో పాటు సొంత భాష అయిన మలయాళంలో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు టిల్లు స్క్వేర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


హీరోయిన్ గా కార్తికేయ 2 సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ కి ఓ భారీ కమర్షియల్‌ హిట్ కావాలి అనుకుంటున్న సమయంలో టిల్లు తో కలిసి వచ్చి టిల్లు స్క్వేర్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడిని మొదటి సారి డిఫరెంట్‌ రోల్‌ లో చూశామంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.


ఇకపై అనుపమ ను మరింత కొత్తగా అందంగా చూస్తారు అంటూ ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోలు ఆమె విజయం తాలూకు ఆనందం ను చూపించకనే చూపిస్తున్నాయి.


అనుపమ పరమేశ్వరన్‌ అందాల ఆరబోత ఫోటోలను ఇకపై రెగ్యులర్ గా షేర్‌ చేయడం ఖాయం. ఇదే జోష్ తో బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందంతో పాటు అభినయంతో మెప్పించడంలో కొద్ది మంది హీరోయిన్స్‌ టాప్‌. వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు అనడంలో సందేహం లేదు.