అనుపమకు ఎంత ధైర్యం?
అయితే ఇన్నేళ్లలో అనుపమ ఏం నేర్చుకుంది? అంటే.. నటిగా ప్రయోగాత్మక పాత్రల్లో చేసేందుకు వెనకాడటం లేదు.
By: Tupaki Desk | 20 March 2024 2:33 PM GMTతెలుగు ఫిలిం జర్నలిస్టులను ఎదురు ప్రశ్నించాలంటే చాలా ధైర్యం కావాలి. మీడియా ముందు బెబ్బే అంటే కుదరదు. అయితే అలాంటి ధైర్యం, తెగువ తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పకనే చెబుతోంది అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ భామ ప్రేమమ్ తర్వాత మలయాళంలో నటించిందేం లేదు. పూర్తిగా తెలుగు చిత్రసీమకే తన సమయాన్ని కేటాయించింది. ఇప్పటికే దశాబ్ధం పాటు కెరీర్ ని ఇక్కడే విజయవంతంగా రన్ చేసింది. ప్రేమమ్ లో ఎంత క్యూట్ గా కనిపించిందో ఇప్పటికీ అంతే క్యూట్ గా ఉంది ఈ బ్యూటీ. అప్పుడు తన వయసు 19. ఇప్పుడు 29. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ స్వయంగా వెల్లడించింది.
అయితే ఇన్నేళ్లలో అనుపమ ఏం నేర్చుకుంది? అంటే.. నటిగా ప్రయోగాత్మక పాత్రల్లో చేసేందుకు వెనకాడటం లేదు. అంతేకాదండోయ్.. జర్నలిస్టులపై ఎదురు దాడి చేసేంత తెగువ కూడా సంపాదించింది. తనను పదే పదే బోల్డ్ గా కనిపిస్తున్నావని, ఎందుకు ఇలా మారావని నిలదీస్తున్న మీడియాపైనే సెటైర్లు వేసేంత తెగవ వచ్చేసింది ఈ క్యూట్ బ్యూటీకి.
మార్చి 29న విడుదల కానున్న టిల్లు స్క్వేర్ చిత్రం, డీజే టిల్లకు సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తన గ్లామర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సీక్వెల్‌లో లిల్లీ పాత్రను పోషిస్తుంది. ఓహ్ మై లిల్లీ పాట విడుదల సమయంలో, ఆమె తన బోల్డ్ క్యారెక్టర్ ఎంపికలు.. అల్ట్రా-గ్లామరస్ లుక్ లో కనిపించడానికి కారణాలపై ప్రశ్నలను ఎదుర్కొంది. అయితే అనుపమ తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేసింది. సంకోచం లేకుండా స్పందించింది.
``నేను ఒకే రకమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు జర్నలిస్టులు, ప్రజలు నన్ను ఒకే రకమైన పాత్రలకు కట్టుబడి ఉండాలా? అని అడుగుతారు. నేను లిల్లీ వంటి పాత్రలు చేసినప్పుడు, ఇలా మారిపోయావేంటి? అని మళ్లీ అడుగుతారు. నేనేం చేయాలి? ఇంట్లోనే ఉండాలా? అంటూ కొంత అసహనంగా ఎదురుదాడి చేసింది. అనుపమ పరమేశ్వరన్ సూటిగా మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి విభిన్న పాత్రలు చేయడానికి ఉత్సాహంగా ఉంటానని అంది. ఇంతకుముందు కొన్ని పరిమితుల వల్ల అలా చేయలేకపోయానని కూడా అంది.
టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్- సిద్ధు జంట పోస్టర్‌లు, టీజర్‌లకు ఘాటైన కామెంట్లు వచ్చి పడ్డాయి. మునుపటి పాత్రలతో పోలిస్తే ఇప్పటి మార్పును సూచిస్తూ, ఘాటైన ముద్దుల సన్నివేశాలతో బోల్డ్ పాత్రలో నటించడం చూసి తన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అనుపమ పరమేశ్వరన్ నటనా ప్రయాణం 2015లో మొదలైంది. మలయాళం చిత్రం ప్రేమమ్ తొలి చిత్రం. అఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కురుప్, రౌడీ బోయ్స్ సహా పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. కార్తికేయ 2 లో తన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. 2022లో 18 పేజెస్ ..బటర్‌ఫ్లై చిత్రాల్లోని నటనకు గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో బోల్డ్ పాత్రతో యూత్ కి మరింత చేరువవుతోంది.