Begin typing your search above and press return to search.

బోల్డ్ క్యారెక్టర్స్ పై అనుపమ ఏమందంటే..

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్

By:  Tupaki Desk   |   19 March 2024 4:01 AM GMT
బోల్డ్ క్యారెక్టర్స్ పై అనుపమ ఏమందంటే..
X

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీని ఇప్పటి వరకు ఎక్కువగా డీసెంట్ పాత్రలలోనే ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. మోడ్రన్ టచ్ తో గ్లామర్ రోల్స్ లో కనిపించింది చాలా తక్కువ. కెరియర్ ఆరంభంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని కంఫర్ట్ జోన్ లో ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది.


దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రౌడీ బాయ్స్ మూవీలో మొదటిసారి గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఇంటిమేట్ సన్నివేశాలలో నటించి అనుపమ అందరికి షాక్ ఇచ్చింది. మళ్ళీ రెగ్యులర్ గా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీలో కంప్లీట్ మోడ్రన్ టచ్ తో అనుపమ గ్లామర్ రోల్ లో కనువిందు చేయబోతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో మూవీలో ఆమె క్యారెక్టర్ ఎంత బోల్డ్ గా ఉండబోతోందనేది స్పష్టం అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా అనుపమ పరమేశ్వరన్ ఇందులో సిద్దుతో కలిసి ఇంటిమేట్ సన్నివేశాలలో జీవించేసింది. మార్చి 29న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. సినిమాపైన భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో టిల్లు స్క్వేర్ లో లిల్లీ లాంటి బోల్డ్ క్యారెక్టర్ ని యాక్సప్ట్ చేయడానికి కారణం అనుపమ తెలియజేసింది. రెగ్యులర్ గా గర్ల్స్ నెక్స్ట్ డోర్ తరహా పాత్రలు చేస్తూ ఉండటంతో బోర్ కొట్టేసింది. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా ఏదైనా చేయాలనిపించింది. లిమిటేషన్స్ అన్ని పెట్టుకుంటే మంచి పాత్రలు చేయలేం.

గ్లామర్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ అయిన లిల్లీ లాంటి రోల్ ని వదులుకుంటే అంతకంటే స్టుపిడిటీ ఉండదని నా ఫీలింగ్. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్యారెక్టర్ మంచి అవకాశం, అందుకే ఒప్పుకున్న అని అనుపమ చెప్పుకొచ్చింది. గ్లామర్ గా ఉన్నా అంటే అది గొప్ప విషయమే కదా. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సిద్దుతో కలిసిన తర్వాత మీరు ఇలా మారిపోయారంట అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అదే నిజం అయితే సిద్దుకి థాంక్స్ చెప్పాలి అని అనుపమ ఆన్సర్ ఇచ్చింది.

అలాగే అందరి ముందే ఓపెన్ గా లిల్లీ క్యారెక్టర్ ని తాను ఎంతగా ఇష్టపడి చేసాను అనేది అనుపమ తెలియజేసింది. అలాగే బిర్యాని అంటే ఇష్టం అని రోజు తినలేం కదా అలాగే ఒకే తరహా పాత్రలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీ మాత్రం నాకు కొత్త అనుభూతిని అందించింది అంటూ అనుపమ పరమేశ్వరన్ మీడియా మీట్ లో చెప్పడం విశేషం.