Begin typing your search above and press return to search.

రైల్వే ప్లాట్‌ఫామ్‌ల‌పై ప‌డుకున్నాను.. ప‌ని కావాల‌ని దేవుడిని అడిగాను: అనుప‌మ్ ఖేర్

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా, న‌ట గురువుగా ప్ర‌సిద్ధి చెందిన అనుప‌మ్ ఖేర్ ఎప్ప‌టికీ గొప్ప గుర్తింపు, గౌర‌వం అందుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   29 May 2024 4:02 AM GMT
రైల్వే ప్లాట్‌ఫామ్‌ల‌పై ప‌డుకున్నాను.. ప‌ని కావాల‌ని దేవుడిని అడిగాను: అనుప‌మ్ ఖేర్
X

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా, న‌ట గురువుగా ప్ర‌సిద్ధి చెందిన అనుప‌మ్ ఖేర్ ఎప్ప‌టికీ గొప్ప గుర్తింపు, గౌర‌వం అందుకుంటున్నారు. కెరీర్ ఆద్యంతం విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లకు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసిన న‌టుడిగా పాపుల‌ర‌య్యారు. న‌ట‌గురువుగాను ఆయ‌న ఎంద‌రో శిష్యుల‌ను తీర్చిదిద్ది సినీప‌రిశ్ర‌మ‌ల‌కు అందించారు.

తన లైవ్-యాక్షన్ మూవీ `ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దామ్యాన్` విడుదలకు సిద్ధమవుతండ‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో త‌న కెరీర్ ఆరంభ రోజుల క‌ష్టాల గురించి ఓపెన‌య్యారు అనుప‌మ్‌. అనుపమ్ ఖేర్ సినీ జీవితం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూలో చాలా అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నారు. మహేష్ భట్ తెర‌కెక్కించిన‌ 1984 చిత్రం `సారాంశ్` చిత్రంతో అనుప‌మ్‌ ఖేర్ తెరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 540 చిత్రాలతో అద్భుతమైన కెరీర్ ని కొన‌సాగించారు. న‌ట‌జీవితంలో ప్రయాణం పరిమితులకు అతీతంగా ఉండాలి. పరిమితుల్లో ఉంటే అది ప్రయాణం కాదు. ఇత‌ర న‌టీనటులు స్థిరంగా ఉన్నప్పుడు.. నా జీవితమంతా అసాధారణమైన పాత్ర‌ల‌ ఎంపికలతో ముందుకు సాగింద‌ని అనుప‌మ్ గుర్తు చేసుకున్నారు.

నేను న‌గ‌రానికి వ‌చ్చిన‌ప్పుడు బట్టతలతో సన్నగా ఉండేవాడిని. ప్రతిభ కంటే హెయిర్‌స్టైల్ చాలా ముఖ్యమ‌ని భావించే ఆరోజుల్లో నేను నటుడిని కావాలనుకున్నాను. నా మొదటి చిత్రం స‌మ‌యానికి నా వ‌య‌సు 28. కానీ 65 ఏళ్ల వ్యక్తిగా న‌టించాను... రొటీన్ పాత్ర‌ల కంటే న‌టుడిగా నిరూపించుకునే వి ఎంచుకున్నాను. నేను ఎప్పుడూ విభిన్నమైన ఎంపికల‌ను ఇష్ట‌ప‌డ్డాను. అలా చేస్తేనే ఎక్కువ‌ సంవత్సరాలు ఈ రంగంలో జీవించగలం.. అని ఖేర్ అన్నారు.

హిందీ చిత్రాల్లో నటించడం అనేది ఉద్దేశపూర్వక ఎంపిక అని తెలిపారు. ఆరంభం న‌చ్చిన ఎంపిక‌లు లేవు. అన్నీ ఉంటే విలాస‌వంతంగా ఆలోచిస్తాం. కానీ నేను 3 సంవత్సరాలు ముంబై వీధుల్లో పని కోసం వెతికాను. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై పడుకున్నాను.. నేను దేవుడికి మాత్రమే చెప్పాను.. నాకు పని ఇవ్వండి .. నేను దేనికీ నో చెప్పను. దానికి త‌గ్గ‌ట్టు దేవుడు చూసాడు. కానీ గత 5-6 సంవత్సరాలలో నేను కొంచెం ఎంపికల జోలికి వెళ్లాను. న‌చ్చిన‌వాటినే ఎంపిక‌ చేసుకున్నాను. నాకు సవాల్ అనిపించే పనిని చేయాలనుకుంటున్నాను... అని అనుప‌మ్ అన్నారు. మీరంతా ఊహించిన‌దానికి భిన్నంగా చేయ‌డం వ్యూహంలో భాగమేన‌ని అన్నారు. అనుప‌మ్‌ ఖేర్ ఈ ఏడాది మార్చి 7న తన పుట్టినరోజు సందర్భంగా తన రెండవ దర్శకత్వ చిత్రం `తన్వి ది గ్రేట్`ని అధికారికంగా ప్రకటించారు.