Begin typing your search above and press return to search.

రోడ్ రోల‌ర్ మ‌సాజ్ కావాల‌న్న క్యూట్ బ్యూటీ

టిల్లూ స్క్వేర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో రింగుల జుత్తు సుంద‌రి క్రేజ్ అమాంతం ప‌దింత‌లైంది

By:  Tupaki Desk   |   8 Jun 2024 3:45 AM GMT
రోడ్ రోల‌ర్ మ‌సాజ్ కావాల‌న్న క్యూట్ బ్యూటీ
X

క్యూట్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇటీవ‌ల స‌క్సెస్ బాట‌లో దూసుకుపోతోంది. టిల్లూ స్క్వేర్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో రింగుల జుత్తు సుంద‌రి క్రేజ్ అమాంతం ప‌దింత‌లైంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో అదిరిపోయే రొమాన్స్ చేసిన అనుప‌మ ప‌ట్టు విడుపు చూసి య‌వ‌త‌రం ఆశ్చ‌ర్య‌పోయారు. రొమాంటిక్ కామెడీలో తన పాత్రకు ప్రశంసలు పొందింది.

అనుప‌మ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోను చాలా చురుకుగా ఉంది. ఎప్పటికప్పుడు ఇన్ స్టా ఎక్స్ వేదిక‌ల‌పై త‌న‌కు సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ను షేర్ చేస్తోంది. తాజా ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ తో ఈ భామ హృద‌యాల‌ను గెలుచుకుంది. తాజా పోస్ట్ లో రోడ్ రోలర్ చేత మసాజ్ చేయించుకోవాలని కోరుకుంది అనుప‌మ‌. సోష‌ల్ మీడియాలో `నా వెనుక ఏమి కావాలి?`` అనే సింపుల్ క్యాప్ష‌న్ తో ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో రోడ్ రోలర్ నేలమీద పడుకున్న వ్యక్తి వెనుకభాగంపై నుంచి వెళుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనుపమ త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో ఇటీవ‌ల ఆక‌ట్టుకుంటోంది. ఈ భామ న‌టించిన‌ చివరి రెండు తెలుగు చిత్రాలు కార్తికేయ 2, టిల్లూ స్క్వేర్ పెద్ద విజ‌యం సాధించాయి. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించినా అంత‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. కార్తికేయ 2 విజయంతో తిరిగి అనుప‌మ పేరు మార్మోగింది. టిల్లు స్క్వేర్ త‌న ఫేట్ నే మార్చింది. ఇప్పుడు వ‌రుస ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది.