Begin typing your search above and press return to search.

అనుపమ అక్కడ ఏం చేస్తున్నట్లు?

ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ ని మంచి గుర్తింపు లభించింది.

By:  Tupaki Desk   |   17 July 2024 11:29 AM GMT
అనుపమ అక్కడ ఏం చేస్తున్నట్లు?
X

మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో గ్లామర్ క్యారెక్టర్ తో రొమాంటిక్ సన్నివేశాలలో నటించి ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఇప్పటి వరకుపెట్టుకున్న హద్దులని టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ పక్కన పెట్టింది. ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ ని మంచి గుర్తింపు లభించింది.


రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశాలకి కూడా అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాలీవుడ్ లో ఆమె ఇప్పుడు యంగ్ హీరోలకి ఛాయస్ గా మారే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే కథల ఎంపికలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అవసరం లేకుండా కేవలం సాంగ్స్ కి, రొమాంటిక్ సన్నివేశాలకి మాత్రమే హీరోయిన్ గా తీసుకుంటామంటే అస్సలు యాక్సప్ట్ చేయదు. కథ నచ్చి, అందులో పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటుంది.


అందుకే ఆమె కెరియర్ మిగిలిన హీరోయిన్స్ అంత స్పీడ్ కనిపించదు. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ సినిమాలు లేని సమయంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. లేదంటే ఎక్కడో ఓచోటకి వెకేషన్ కి వెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో రెడ్ కలర్ లాంగ్ టీషర్టుతో మిడ్డీ లాంటి డ్రెస్ లో ఫోటోలకి పోజులిస్తున్న పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలతో ఆమె జపాన్ లో షికారు చేస్తోందని తెలుస్తోంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


స్లిమ్ అయిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోందని ఈ ఫోటోలు చూస్తుంటే అర్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని పాన్ ఇండియా సినిమాల కోసం అనుపమ పేరు పరిశీలిస్తున్నారంట. టిల్లు స్క్వేర్ తర్వాత బడా ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. తెలుగులో హీరోయిన్ ఒరియాంటెడ్ గా సిద్ధం అవుతోన్న పరదా మూవీ షూటింగ్ దశలో ఉందని తెలుస్తోంది.

అలాగే మాతృభాష మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో లాక్ డౌన్ అనే మూవీ కంప్లీట్ చేసింది. బిసన్ అనే మరో మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కి సంబందించిన కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే ఆమె రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.