కెమెరా ముందు రొమాన్స్ అంత సులువు కాదు!
బ్లాక్ బస్టర్ 'డిజె టిల్లు'కు సీక్వెల్ గా రూపొందిన టిల్లూ స్క్వేర్ విడుదలకు రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లుగా తన పాత్రను తిరిగి పోషించగా
By: Tupaki Desk | 26 March 2024 4:54 AM GMTబ్లాక్ బస్టర్ 'డిజె టిల్లు'కు సీక్వెల్ గా రూపొందిన టిల్లూ స్క్వేర్ విడుదలకు రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లుగా తన పాత్రను తిరిగి పోషించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అతడితో రొమాన్స్ చేస్తోంది. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ లో అనుపమ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. సిద్ధూతో ఆమె చేసిన శృంగార సన్నివేశాలు చాలా మందిని ఆకర్షించాయి. చివరగా అనుపమ ఈ సీన్స్ గురించి తన మౌనాన్ని వీడింది.
టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ లిల్లీగా నటించింది. ఈ చిత్రం 2024లో అనుపమకు మూడో సినిమా. ఇవేగాక అనేక ప్రాజెక్ట్‌లు క్యూలో ఉన్నాయి. ఇంతకు ముందు రవితేజతో డేగ సినిమాలో నటించి ఆ తర్వాత జయం రవితో సైరన్‌లో నటించింది. ప్రతిసారీ వైవిధ్యం ఉన్న పాత్రల్లో మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు టిల్లు స్క్వ్యేర్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. దీని గురించి అనుపమను అడిగినప్పుడు తన సినిమాలలో విభిన్నమైన పాత్రలను పోషించేందుకు ప్రయత్నిస్తున్నానని స్పష్టం చేసింది.
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిల్లూ స్క్వేర్‌లో సిద్ధు జొన్నలగడ్డతో నటించిన ఘాటైన సన్నివేశాల గురించి హోస్ట్ ప్రశ్నించారు. ఇందులో రొమాన్స్ సీన్స్ గురించి ప్రశ్నించారు. అయితే కెమెరాల ముందు అంతమంది సమక్షంలో రొమాన్స్ సీన్లలో నటించడం అంత సులువు కాదని అనుపమ అంది. వందమంది ముందు నటించడం చాలా కష్టం. ఆ సమయంలో పాత్రలో లీనమవుతూ, ఆడియెన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదని అంది. రొమాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ సినిమాలో కిస్ సీన్ గురించి అందరూ అడుగుతున్నారని కూడా అనుపమ తెలిపింది.
గతంలోను అనుపమ జర్నలిస్టులపై ఘాటుగా స్పందించింది. ప్రేమమ్ లో నటించేప్పుడు నా వయసు 19. అప్పటి వయసుకు తగ్గట్టు పాత్రలు చేసాను. ఇప్పుడు నా వయస్సు 29, కాబట్టి నేను విభిన్న పాత్రలను అన్వేషించాల్సి ఉంది అని కూడా అంది. నేను ఒకే రకమైన పాత్రలు పోషించినప్పుడు కూడా, జర్నలిస్టులు, ప్రజలు ఎందుకిలా చేసావు అనడుగుతారు. నేను లిల్లీ వంటి పాత్రలు చేసినప్పుడు, ఇలాంటి వాటిని ఎందుకు చేయాలని నిర్ణయించుకున్నావు? అని మీరే మళ్లీ అడుగుతారు. నేనేం చేయాలి? ఇంట్లోనే ఉండాలా? అని ఎదురు ప్రశ్నించింది.
మల్లిక్ రామ్ టిల్ స్క్వేర్‌కి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 29 మార్చి 2024న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.