Begin typing your search above and press return to search.

ఆ న‌వ్వులోనే ముత్యాలు రాల్తున్నాయ్ అమ్మ‌డు!

న‌వ్వితే ముత్యాలు రాల్తున్నాయ్ అనే ఓ సామెత ఉంది. స‌రిగ్గా ఇప్పుడా సామెత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కి స‌రిపోతుంది. అమ్మ‌డు న‌వ్వితే నిజంగానే ముత్యాలు రాలుతున్నాయ్ అన్న‌ట్లుగా ఉంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:23 PM GMT
ఆ న‌వ్వులోనే ముత్యాలు రాల్తున్నాయ్ అమ్మ‌డు!
X

న‌వ్వితే ముత్యాలు రాల్తున్నాయ్ అనే ఓ సామెత ఉంది. స‌రిగ్గా ఇప్పుడా సామెత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కి స‌రిపోతుంది. అమ్మ‌డు న‌వ్వితే నిజంగానే ముత్యాలు రాలుతున్నాయ్ అన్న‌ట్లుగా ఉంది. అమ్మ‌డు వెకేష‌న్ లో భాగంగా ప్రెండ్స్ గ్యాంగ్ తో ఫారెస్ట్ ట్రెకింగ్ వెళ్లిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆన్ ది వేలో మ‌ట్టిరోడ్డు మ‌ధ్య‌లో వొంగుని మ‌రీ ఇలా న‌వ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చింది. ఆ న‌వ్వులో అనుప‌మ ఎంత సంతోషంగా ఉందో తెలుస్తుంది.


ముఖం మెరిసిపోతుంది. అమ్మ‌డి ప‌ళ్లు వ‌రుస ఎంతో చక్క‌గా ఉంది. వాకింగ్ కి కంప‌ర్ట్ బుల్ గా ఉండే దుస్తులు ధ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇక అనుప‌మ హెయిర్ స్టైల్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. రింగు రింగుల జుత్తు మొత్తాన్ని ద‌గ్గ‌ర‌కి చేర్చి ర‌బ్బ‌ర్ బ్యాండ్ వేసింది. కెమెరా లో హెయిర్ స్టైల్ ఫోక‌స్ అయ్యేలా చూసుకుంది. ఇదొక ఫ‌న్ ట్రిప్ అంటూ ఆ ఫోట‌కి ఓక్యాప్ష‌న్ కూడా జోడించింది.


ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక అభిమానుల నుంచి ప్ర‌పోజ‌ల్స్ క్యూ క‌ట్టాయి. ఒకరి వెంట ఒక‌రు త‌మ‌దైన శైలిలో ప్ర‌పోజ్ చేసారు. ఆ న‌వ్వుతోనే నా హృదయాన్ని దోచేసావ్ అను అంటూ ఓ అభిమాని ప్ర‌పోజ్ చేసాడు. అమ్మ‌డు ఏ జంగిల్ లో ల్యాండ్ అయిందంటూ మ‌రోక‌రు కామెంట్ పెట్టారు.

ఈ బ్యూటీ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రౌడీబోయ్స్..కార్తికేయ‌-2 లాంటి స‌క్సెస్ లు అనుప‌మ కెరీర్ ని ఒక్క‌సారిగా పైకి లేపాయి. అప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాలు చేసినా ఏ సినిమా తీసుకురాని గుర్తింపు ఈ రెండు విజ‌యాలు అందించాయి. ప్ర‌స్తుతం సిద్దు జొన్న‌ల‌గ‌డ‌డ్డ స‌ర‌స‌న టిల్లుస్వ్కేర్ లో న‌టిస్తోంది. ఇందులోనూ అమ్మ‌డు రొమాంటిక్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని ప్రచార చిత్రాల‌తో తెలుస్తుంది.